Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఆరోగ్య సర్వే ; 19 ఏళ్లలోపే అమ్మాయిలకు తొలి అనుభవం

ఆరోగ్య సర్వే ; 19 ఏళ్లలోపే అమ్మాయిలకు తొలి అనుభవం

జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ (ఎన్ఎఫ్ హెచ్ఎస్ ) భారతీయుల లైంగిక జీవితంపై నిర్వహించిన సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు అసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా లైంగిక జీవిత గణాంకాలు తెలియజేస్తూ అమ్మాయిలు 19 ఏళ్లలోపే లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని పేర్కొంది. పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది. 

అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది. పెళ్లికి ముందు సెక్స్ పై నిషేధం ఉన్నప్పటికీ.. 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు.

ఇదే సందర్భంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో చురుకుగా లైంగిక జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది. 2015-16లో ఈ సర్వేను నిర్వహించిన ఎన్ఎఫ్ హెచ్ఎస్ దాని వివరాలను తాజాగా విడుదల చేసింది.  వివిధ గ్రూపుల వయసులో ఉన్న లక్ష మంది పురుషులు, మరో లక్ష మంది మహిళలను సర్వేలో భాగం చేశారు. 

Read More