Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Namrata Shirodkar : లవ్యూ మామయ్య గారు.. సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ నమ్రత ఎమోషనల్

Namrata Shirodkar Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత వారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తన మామగారికి గుర్తు చేసుకుని నమ్రత ఎమోషనల్ అయింది. తన మామ గారి గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ వేసింది.

Namrata Shirodkar : లవ్యూ మామయ్య గారు.. సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ నమ్రత ఎమోషనల్

Namrata Shirodkar Recalls Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో స్పృహలేని స్థితిలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొస్తే.. ఇరవై నాలుగు గంటలకు పైగా వైద్యులు చికిత్స చేసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ చివరకు కృష్ణ కన్నుమూశారు. అయితే కృష్ణ మరణంతో ఘట్టమననేని అభిమానులకు తీరని లోటు ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో రమేష్‌ బాబును కోల్పోవడం, సెప్టెంబర్‌లో ఇందిరా దేవీ మరణం, నవంబర్‌లో కృష్ణ మృతిచెందడం ఘట్టమనేని అభిమానులకు కుంగదీసింది.

ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో మహేష్‌ బాబు సైతం కుంగిపోయాడు. తన తండ్రి మరణాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టేసుకున్నాడు. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని మాటిచ్చాడు. తన తండ్రి తనలోనే ఉన్నాడని, ఇది వరకంటే ఎక్కువ ధైర్యం, సత్తా, శక్తి తనలో ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ వేసిన పోస్ట్ అందరినీ కదిలిచింది.

ఇప్పుడు నమ్రత సైతం మహేష్‌ బాబులానే స్పందించింది. ఎప్పటికీ నిలిచిపోయే సూపర్ స్టార్.. ఎన్నింటికో పునాది వేసి.. నిజమైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.. ఆయనకు సినిమా పట్ల ఉన్న పిచ్చి, ప్యాషన్, ప్రేమ వల్లే సూపర్ స్టార్ అయ్యారు.. ఆయన ఎప్పటికీ సూపర్ స్టారే. నాకు ఆయన తెలియడం, ఆయన్ను మామగారు అని పిలవడం నా అదృష్టం.. జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నాను.. అవన్నీ ఎప్పుడూ నేను పాటిస్తూనే ఉంటాను.. ఆయన ఖ్యాతిని ఎప్పటికీ మేం పండుగలా జరుపుకుంటూనే ఉంటాం.. లవ్యూ మామయ్య గారు అని ఎమోషనల్ అయింది.

Also Read : Nandamuri Balakrishna : అనిల్ రావిపూడిపై బాలయ్య ఫైర్?.. కారణం ఇదేనా?

Also Read : RC 15 Song Shoot : రామ్ చరణ్‌తో క్లోజ్‌గా కియారా అద్వాణీ.. ఉపాసన కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More