Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున

బాలీవుడ్ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. 2003లో రిలీజైన ఎల్వోసీ కార్గిల్ తరవాత నాగ్ మళ్ళీ బాలీవుడ్ సినిమాలో నటించలేదు.

బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున

బాలీవుడ్ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. 2003లో రిలీజైన ఎల్వోసీ కార్గిల్ తరవాత నాగ్ మళ్ళీ బాలీవుడ్ సినిమాలో నటించలేదు. అయితే ఇప్పుడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారనే న్యూస్, అక్కినేని ఫ్యాన్స్‌లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్న ఈ  యాక్షన్‌ థ్రిల్లర్‌లో బిగ్ బి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్‌లో నాగ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాని కరణ్ జోహార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం చాలా కాలంగా నాగార్జున ఎదురు చూస్తున్నారు. బ్రహ్మస్త్ర దర్శకుడు అప్రోచ్‌ అవ్వటం, కథ నచ్చటం.. పైగా అమితాబ్‌ కూడా నటిస్తుండటంతో వెంటనే నాగార్జున ఒప్పుకొని సంతకం కూడా చేసేశారని ఓ ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. అంతేకాదు త్వరలో ముంబైలో జరగబోయే షెడ్యూల్‌కు నాగ్‌ హాజరుకాబోతున్నట్లు ఆ కథనం తెలిపింది.

ఫాంటసీ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగ్, బాలీవుడ్‌లో తన ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నా, ఈ న్యూస్ అఫీషియల్‌గా ట్రాన్స్‌ఫామ్ అవుతుందా..? జస్ట్ రూమర్‌లా మిగిలిపోనుందా..? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఆయనతో పాటు హీరో నాని కూడా నటిస్తున్నారు.

Read More