Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మదర్స్ డే 2018: శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ.

మదర్స్ డే 2018: శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ. తల్లులు ఈ సమాజానికి చేసిన ప్రత్యేక సేవలను గుర్తిస్తూ జరుపుకునే ప్రత్యేక దినోత్సవమే మదర్స్ డే. నేడు మాతృదినోత్సవం.. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మ వల్లే ఈ స్థానంలో ఉన్నా: కేటీఆర్

ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి... తాను ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి అమ్మే కారణం అని అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఒక పోస్టు కూడా పెట్టారు. తల్లిదండ్రులతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చందుర్తి, కోనరావుపేట, తంగళ్ళపల్లి మండలాల్లో జరిగే రైతుబంధు చెక్కుల పంపిణీలో పాల్గొని రైతులకు చెక్కులను అందజేయనున్నారు.

 

వారిని అమితంగా ప్రేమించాలి: మహేశ్

'నేను, నా పిల్లలు గొప్ప అమ్మలను కలిగి ఉన్నందుకు పెట్టి పుట్టాము. వారిని అమితంగా ప్రేమించాలి' అని మహేశ్ బాబు తల్లిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. మహేశ్  తాజాగా న‌టించిన మూవీ 'భ‌ర‌త్ అను నేను'. ఈ మూవీ విడుద‌లై మూడు వారాలు పూర్తయింది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కూ రూ. 205 కోట్ల రూపాయిలు గ్రాస్ వ‌సూలు చేసింది. మహేశ్ బాబు తొలిసారిగా ఈ మూవీ ద్వారా రెండు వంద‌ల కోట్ల మార్క్‌ను దాటాడు.

 

అమ్మకు ధన్యవాదాలు: వైఎస్ జగన్

ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం మరొకటి లేదని వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. 'నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం. ఆమెకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. అటు కైకలూరు నుంచి ఇవాల్టి 160వ రోజు ప్రజా సంకల్పయాత్రను ప్రారంభించిన జగన్.. కాకతీయ నగర్, దెయ్యంపాడు, చిన్తపాడు, కొవ్వాడ లంక, మణుగులూరు, కాలకర్రు, మహేశ్వరం పురం మీదుగా పాదయాత్ర చేస్తారు.

మదర్స్ డే సందర్భంగా బిగ్ బి అమితాబ్  విష్ చేశారు. తల్లి ప్రేమ లాంటిది ఈ సృష్టిలో మరొకటి లేదని ట్వీట్ చేశారు. 

 

మదర్స్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ విష్ చేశారు. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ... ట్వీట్ చేశారు.

 

తన తల్లితో కలిసి సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి:

 

మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పదనం గురించి వీడియో ద్వారా వివరించిన ప్రముఖ నటి మాధురి దీక్షిత్:

 

మదర్స్ డే సందర్భంగా హైదరాబాద్ బ్యూటీ, బాలీవుడ్ నటి అదితి రావు హైదరి ట్వీట్:

 

మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్వీట్:

 

మదర్స్ డే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అన్నపూర్ణకు నివాళులు:

 

 మదర్స్ డే సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్:

 

అటు ఎంపీ కవితతో పాటు నటులు నాగ శౌర్య, లావణ్య త్రిపాఠి, రాశీఖన్నా తదితరులు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More