Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

God Father Teaser Update: బర్త్ డే ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఖాయమట!

Megastar Chiranjeevi's God Father Teaser To Be Out On August 21: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ నుంచి అప్డేట్ రాబోతోంది. సినిమా టీజర్ ను 21న విడుదల చేయనున్నారు.

God Father Teaser Update: బర్త్ డే ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఖాయమట!

Megastar Chiranjeevi's God Father Teaser To Be Out On August 21: మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా ఆయన ఆచార్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ కీలకపాత్రలో రూపొందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను ఏ మాత్రం అందుకోకపోవడంతో తన తర్వాతి సినిమాల మీద మెగాస్టార్ చిరంజీవి దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. అలాగే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో హనుమాన్ జంక్షన్ వంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.

అలాగే ఈ సినిమాను ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ విడుదల చేసింది సినిమా యూనిట్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 21వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.

వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా పూరి జగన్నాథ్ ఒక జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రకటించిన వాటి నుంచే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక 21వ తేదీన విడుదలయ్యే టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

Also Read: The Ghost Thamahagane Word Meaning: ‘తమ హగనే’ అంటే అర్థం ఇదే.. అసలు విషయం బయట పెట్టేసిన ది ఘోస్ట్‌ టీమ్!

Also Read: Karthikeya 2 Craze in Hindi: హిందీలో కార్తికేయ 2కి బ్రహ్మరధం.. 50 షోలతో మొదలై 3000 దాకా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More