Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మోహన్ లాల్  రీమేక్ మూవీ లో చిరంజీవి ?

సైరా రిలీజ్ కు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు చిరు తన నెక్ట్స్ మూవీపై దృష్టి సారించారు.

మోహన్ లాల్  రీమేక్ మూవీ లో చిరంజీవి ?

మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా. ఈ సినిమా అదే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడీ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు రావడానికి కారణం ఈ రీమేక్ రైట్స్ ను మెగా కాంపౌండ్ దక్కించుకోవడమే. ఈ సినిమాను డైరక్ట్ చేసిన పృధ్వీరాజ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

సైరా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న చిరు.... ఈ మూవీ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దీంతో పాటు లైన్లో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. సో.. లూసిఫర్ రీమేక్ ఇంత త్వరగా సెట్స్ పైకి వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వచ్చినప్పటికీ అందులో హీరో మాత్రం చిరంజీవి అనేది ఫిక్స్. ఎందుకంటే లూసిఫర్ లో మోహన్ లాల్ చేసిన పాత్ర అలాంటిది.

Read More