Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అదరగొడుతున్న సైరా నర్సింహా రెడ్డి మేకింగ్ వీడియో

అదరగొడుతున్న సైరా నర్సింహా రెడ్డి మేకింగ్ వీడియో

అదరగొడుతున్న సైరా నర్సింహా రెడ్డి మేకింగ్ వీడియో

గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతకన్నా ముందుగానే మెగాస్టార్ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా సైరా నర్సింహా రెడ్డి చిత్ర నిర్మాతలు విడుదల చేసిన సినిమా మేకింగ్ వీడియోకు భారీ స్పందన కనిపిస్తోంది. తొలి తరం స్వాతంత్య్రోద్యమ నాయకులలో ఒకరిగా పేరు గడించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా తాజాగా విడుదలైన ఈ మేకింగ్ వీడియో ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఔరా అనిపించే యుద్ధ సన్నివేశాలు, ఆ సన్నివేశాలను సినిమాటోగ్రఫర్ రత్నవేలు కెమెరాలో బంధించిన తీరు, చరిత్రను కళ్ల ముందుకు తీసుకొచ్చినట్టున్న ఆకట్టుకునే భారీ సైజ్ సెట్టింగులను ఈ మేకింగ్ వీడియోలో చూడొచ్చు.

 

సినిమాటోగ్రఫర్ రత్నవేలు, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, స్టంట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్, గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్ వంటి ప్రముఖులు ఎందరో ప్రముఖులు ఈ సినిమాకు సేవలు అందించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండియాస్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, జగపతిబాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, నిహారిక కొనిదెల, రవికిషన్ వంటి స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఎందరో ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్‌పై మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ మేకింగ్ వీడియో మిగిల్చిన సస్పెన్స్ తీరాలంటే సైరా నర్సింహా రెడ్డి విడుదలయ్యే వరకు వేచిచూడక తప్పదు.

 

Read More