Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

సీఐడీ ఆఫీసర్ గెటప్‌లో మహేష్

                     

సీఐడీ ఆఫీసర్ గెటప్‌లో మహేష్

ప్రస్తుతం టావీవుడ్ లో మహేష్ బాబు సరికొత్త గెటప్ పై జోరుగా చర్చ నడుస్తోంది. త్వరలోనే సీఐడీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట ఈ సూపర్ స్టార్ . ఇప్పటివరకు ఎవరూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇదట. సుకుమార్-మహేష్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

సుకుమార్, మహేష్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు పూర్తయిన విషయం తెలిసిందే. సుక్కూ చెప్పిన 2-3 క్యారెక్టరైజేషన్ల నుంచి ఒక క్యారెక్టర్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ క్యారెక్టర్ సీఐడీ ఆఫీసర్ అని టాక్. కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్  జానర్ లో సినిమా రాబోతోందట.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. స్క్రీన్ ప్లే రాసే పనిలో సుకుమార్ అండ్ టీం బిజీ అయింది. వంశీ పైడిపల్లితో సినిమా స్టార్ట్ అయి, ఓ షెడ్యూల్ కంప్లీట్  అయిన వెంటనే.. మహేష్-సుక్కూ సినిమా పట్టాలపైకి వస్తుందట.

Read More