Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు

Super Star Krishna Last Rites మహేష్ బాబు గత నెలలో తన అమ్మ ఇందిరమ్మ అస్థికలను గంగానదిలో కలిపారు. ఇప్పుడు తన నాన్న అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.

Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు

Super Star Krishna Last Rites : సూపర్ స్టార్ కృష్ణ గత మంగళవారం (నవంబర్ 15) మరణించిన సంగతి తెలిసిందే. అయితే నేడు మహేష్‌ బాబు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపాడు. కృష్ణ అస్థికలు కృష్ణా నదిలో నిమజ్జనం చేసిన మహేష్ బాబు వెంటనే హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికల నిమజ్జనం చేశాడు. మహేష్‌ బాబు వెంట కుటుంబ సభ్యులతో పాటుగా త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మహేష్ బాబు...  గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు.

మహేష్ బాబుకు ఈ ఏడాది దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జనవరిలో అన్న రమేష్‌ బాబు మరణించారు. సెప్టెంబర్‌లో అమ్మ ఇందిర మరణించారు. ఇప్పుడు నాన్న తుది శ్వాస విడిచారు. ఇలా మహేష్‌ బాబుకు ఒకే ఏడాదిలో కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం. పైగా అమ్మ అస్థికలు గంగానదిలో కలిపి కనీసం నెల కూడా అయిందో లేదో.. ఇప్పుడు ఇలా నాన్న అస్థికలను కృష్ణానదిలో కలిపాడు మహేష్‌ బాబు.

సూపర్ స్టార్ కృష్ణ మోమోరియల్, కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసేందుకు ఘట్టమనేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్‌ బాబు ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండేట్టు కనిపిస్తోంది. డిసెంబర్‌లో త్రివిక్రమ్ మహేష్‌ బాబు మూవీ సెట్స్‌కు వెళ్తుందా? లేదా? అన్నది క్లారిటీ లేదు.
Also Read : Jason David Frank Suicide : పవర్ రేంజర్ ఇకలేరు.. ఆత్మహత్య చేసుకున్న గ్రీన్ రేంజర్

Also Read : Allu Arjun Allu Arha Cute Video  : కందిరీగలు కుడుతున్నాయ్ అంట.. బన్నీతో అర్హ ముద్దు ముద్దు ముచ్చట్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More