Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Dheera Movie: ఇచ్చిపడేసిన లక్ష్ చదలవాడ.. 'ధీర' మూవీ టీజర్ చూశారా..!

Dheera Movie Teaser: లక్ష్ చదలవాడ హీరోగా.. విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందిన మూవీ ధీర. ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌ షురూ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌తోనే లక్ష్‌ చదలవాడ ఇచ్చిపడేశాడు.
 

Dheera Movie: ఇచ్చిపడేసిన లక్ష్ చదలవాడ.. 'ధీర' మూవీ టీజర్ చూశారా..!

Dheera Movie Teaser: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్స్‌ అందుకుని.. మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు హీరో లక్ష్ చదలవాడ. ఓ మంచి కమర్షియల్ సబ్జెక్ట్‌తో రానున్నాడు. ధీర అంటూ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. 

ఇప్పటికే ధీర మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ధీర టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మాస్, యాక్షన్ హీరోగా లక్ష్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. 'డబ్బంటే నీకు ఎందుకంత పిచ్చి..' 'మావోడు కథలు చెప్తే రియలో.. ఫేకో అతను చెప్తే తప్పా తెలియదు.. అలాంటిది అతనికే కథలు చెప్తావేంట్రా'.. 'అంబులెన్స్ వెనుక వస్తే సైడ్ ఇవ్వాలి.. నాలాంటోడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి.. కాదని గెలికితే.. ఒక్కొక్క నా కొడుక్కి ఇచ్చి పడేస్తా' అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్‌తో సూపర్ డైలాగ్స్‌తో అలరించడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. 

ధీర మూవీ షూటింగ్‌తో పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.  ఫిబ్రవరి 2న ఆడియన్స్‌ ముందుకు గ్రాండ్‌గా రానుంది. నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

 

సాంకేతిక బృందం
==> సమర్పణ: చదలవాడ బ్రదర్స్ 
==> బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర 
==> ప్రొడ్యూసర్: పద్మావతి చదలవాడ
==> మ్యూజిక్: సాయి కార్తీక్
==> సినిమాటోగ్రఫీ:  కన్నా పీసీ
==> ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
==> ఎడిటర్: వినయ్ రామస్వామి
==> రచన, డైరెక్షన్: విక్రాంత్ శ్రీనివాస్
==> PRO: సాయి సతీష్, రాంబాబు

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Read More