Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మెగాస్టార్ తరుపరి చిత్రం ఆ స్టార్ డైరెక్టర్‌తోనే.!

అన్ని కుదిరితే 'సైరా' తరువాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు చిరు.

మెగాస్టార్ తరుపరి చిత్రం ఆ స్టార్ డైరెక్టర్‌తోనే.!

ఇటీవలే 'భరత్ అనే నేను' సినిమాతో మరో సక్సెస్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవలే చిరుకు శివ ఓ కథను కూడా వివరించినట్లు టాక్. ఈ కథ నచ్చడంతో దీన్ని డెవలప్ చేయమని చిరు శివకు చెప్పాడట. కాగా ప్రస్తుతం చిరంజీవి 'సైరా' మూవీతో బిజీగా ఉండటం తెలిసిందే..!

కొరటాల శివ రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది కూడా. మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం కంటే ముందే చరణ్‌తో ఓ మూవీ ఖాయం చేసుకున్నాడు కొరటాల. అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదు.. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అంతలోనే ప్లానింగ్స్ మారిపోయాయి. ఆ సినిమా మొదలు కాలేదు. ఇటీవల చిరుని కలిసిన కొరటాల ఓ స్టోరీలైన్‌ను వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో చిరు స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అన్ని కుదిరితే 'సైరా' తరువాత కొరటాల సినిమా ఉంటుందని సమాచారం. శివ, చిరంజీవి కలయికలో సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.

'సైరా'లో విలన్ పాత్రలో రవి కిషన్

సైరాలో భోజ్‌పురీ నటుడు రవి కిషన్ నటిస్తున్నాడు. బ్రిటీషర్లపై ఉయ్యాలవాడ పోరాటాన్ని వ్యతిరేకించే ఓ గ్రామ పెద్ద పాత్రలో భోజ్‌పురీ సూపర్ స్టార్‌పై ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రేసుగుర్రంలో విశేష గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్.. శనివారం రాత్రి జరిగిన భోజ్‌‌పురీ సినీ అవార్డుల వేడుకలో 'భోజ్‌పురీ రత్న' అవార్డు పొందాడు.

Read More