Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Vikrant Rona: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా 'విక్రాంత్ రోణ' ఎలా ఉందో తెలుసా?

Vikrant Rona Movie Twitter Review: విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుదీప్. సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

Vikrant Rona: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా 'విక్రాంత్ రోణ' ఎలా ఉందో తెలుసా?

 Vikrant Rona Movie Twitter Review: అవడానికి కన్నడ సూపర్ హీరో అయినా సరే ఈగ సినిమాతో విలన్ గానే సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కాబట్టి అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు సుదీప్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాల మీద ఆశక్తి చూపిస్తూ వస్తున్నారు. అయితే నేరుగా ఇప్పటివరకు సుదీప్ ఏ సినిమాతోనూ మళ్ళీ తెలుగులో హీరోగా రాలేదు. మధ్యలో బాహుబలి, సైరా వంటి సినిమాలలో అడపాదడపా పాత్రలు చేశారు.

కానీ ఎట్టకేలకు చాలా కాలం తర్వాత విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అలాగే మిగతా పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.

కన్నడ దర్శకుడు అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దాదాపు 95 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించారు. ఈ సినిమాని జి స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, పివిఆర్ పిక్చర్స్ విడుదల చేస్తున్నాయి. సుదీప్ కెరియర్ లోనే భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం మీద ఇప్పటికే సినిమా చూసిన కొంతమంది తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉందనేది వారి వారి అభిప్రాయాల్లోనే చూద్దాం. 

విక్రాంత్ రోణ సినిమా ఒక విజువల్ మాస్టర్ పీస్ అంటూ మొహిత్ ధావన్ అనే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక అలాగే మను అనే మరో నెటిజన్ ఇది ఇండియన్ సినీ చరిత్రలో ఒక మాస్టర్ పీస్ అని పేర్కొన్నారు. కుమార్ అనే మరో నెటిజన్ సినిమా చూసిన వాడిగా చెబుతున్నానని దీన్ని 3Dలోనే చూడాలని కోరారు. ఈ సినిమా ఒక సుపర్బ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక వినీత అనే జర్నలిస్ట్ కూడా సినిమా అద్భుతంగా ఉందని ఖచ్చితంగా చూసి తీరాలని కామెంట్ చేశారు. మొత్తం మీద ట్వీట్లు చూస్తుంటే సినిమా అద్భుతంగా ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. 

 

Read Also: Alia Bhatt: ప్రెగ్నెన్సీ ట్రోల్స్ పై అలియా ఘాటు స్పందన.. అయితే ఏంటి ఇబ్బంది అంటూ!

Read Also: Bimbisara: రాజ్యకాంక్షతో రగిలిపోతున్న బింబిసారుడు.. ఒక్కసారిగా అంచనాలు పెంచారుగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Read More