Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Khushbu sundar: ఆస్పత్రి బెడ్డుపై కుష్బూ.. నటి పరిస్థితి ఎలా ఉందంటే..?

Khushbu sundar Hospitalized నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ హాస్పిటల్లో చేరిన సంగతి ఇప్పుడు వైరల్ అవుతోంది. గత నాలుగైదు రోజుల క్రితం కుష్బూ ఆస్పత్రిలో చేరింది.

Khushbu sundar: ఆస్పత్రి బెడ్డుపై కుష్బూ.. నటి పరిస్థితి ఎలా ఉందంటే..?

Khushbu sundar Hospitalized : సీనియర్ నటి, ప్రస్తుత బీజేపీ నాయకురాలు కుష్బూకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఆస్పత్రి బెడ్డుపై అచేతనావస్థలో ఉన్న కుష్బూ ఫోటో ఒకటి ట్రెండ్ అవుతోంది. అయితే అక్టోబర్ 5వ తేదీని ఆమె వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దసరా పండుగ ఈసారి కుష్బూ ఇంట్లో జరగనట్టుంది. ఆమెకు వెన్ను నొప్పి ఎక్కువ అవ్వడంతో.. ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సలహాలు ఇచ్చారట. దీంతో ఆమె ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటోందట.

అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు ఆలస్యంగా చెబుతున్నందుకు క్షమించండని కుష్బూ తన ఫాలోవర్లను, అభిమానులను కోరింది. ఈ మేరకు ఆమె వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.  కొద్ది రోజులుగా వెన్నెముక సమస్య వేధిస్తోంది. ఈ కారణంగానే ఆసుపత్రిలో చేరాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ రోజువారీ విధుల్లో పాల్గోంటాను. ఆలస్యంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి అని కుష్బూ ట్వీట్ వేసింది.

దీంతో కుష్బూ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం కుష్బూ బుల్లితెర, వెండితెర, రాజకీయాల్లో బిజీగా ఉంది. బుల్లితెరపై అంటే.. జబర్దస్త్ షోలోనూ జడ్జ్‌గా కనిపిస్తోంది. కోలీవుడ్‌లోనూ స్మాల్ స్క్రీన్ మీద కుష్బూ సందడి చేస్తోంది. సినిమాల్లోనూ కుష్బూ ఇప్పుడు బిజీగా మారుతోంది. రీసెంట్‌గా అంటే.. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కుష్బూ ఓ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ అవ్వలేదు.

ఇక కుష్బూ సుందర్ రాజకీయంగానూ ఎక్కువగా కాంట్రవర్సీలో చిక్కుకుంటుంది. ఆమె మతం, కట్టూబొట్టూ, పేరు ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ కుష్బూ కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద కుష్బూ ఈ మధ్య ఎక్కువగా సెటైర్లు వేస్తోంది.

Also Read: Shivatmika Sizzling Photos: రాజశేఖర్ చిన్న కూతురు పరువాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా?

Also Read: Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More