Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరు మృతి !

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం క‌బీర్ సింగ్ అనే పేరుతో హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్ర పోషించగా హిందీలో ఆ పాత్రలో షాహీద్ కపూర్ కనిపించనున్నాడు.

సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరు మృతి !

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం క‌బీర్ సింగ్ అనే పేరుతో హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్ర పోషించగా హిందీలో ఆ పాత్రలో షాహీద్ కపూర్ కనిపించనున్నాడు. షాహీద్ కపూర్ సరసన అతడి ప్రియురాలి పాత్రలో కైరా అద్వానీ నటిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే హిందీ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో పోస్టర్లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. 

ప్ర‌స్తుతం కబీర్ సింగ్ సినిమా షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌కి సమీపంలోని ముస్సోరిలో జ‌రుగుతోంది. సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న ఓ అనుకోని ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన రామ్ కుమార్ (35) అనే వ్యక్తి షూటింగ్ లొకేషన్‌లో జనరేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. జ‌న‌రేట‌ర్‌లో ఆయిల్ చెక్ చేసేందుకు వెళ్ళ‌గా ఆయ‌న తలకు చుట్టుకున్న మ‌ఫ్ల‌ర్ జ‌న‌రేట‌ర్ చక్రానికి చిక్కుకుంది. దీంతో రాము త‌ల కూడా జ‌న‌రేట‌ర్ చక్రంలోకి వెళ్ళిపోవడం, అత‌డి త‌ల‌కి బ‌ల‌మైన గాయాలు అవడం క్షణాల్లో జరిగిపోయింది. 

ప్రమాదం జరిగిన వెంట‌నే కబీర్ సింగ్ మూవీ యూనిట్ సభ్యులు రామ్ కుమార్‌ని దెహ్రాదూన్‌లోని మ్యాక్స్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. అయితే అప్పటికే అతడి త‌ల‌కి బలమైన గాయం తగిలిన కారణంగా అత‌ను మృతి చెందిన‌ట్టు డాక్టర్లు తెలిపారు. 

Read More