Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్.. పూరి జగన్నాథ్ మార్క్ ట్రైలర్

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్.. పూరి జగన్నాథ్ మార్క్ ట్రైలర్ 

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్.. పూరి జగన్నాథ్ మార్క్ ట్రైలర్

కథ, కాన్సెప్ట్ ఏదైనా.. దేనికి జంకకుండా సినిమాను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకులలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సరైన బొమ్మ పడితే పర్‌ఫెక్ట్ సినిమా చూపించే సరుకున్న హీరో రామ్ పొతినేని. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబోలో విడుదలకు సిద్ధమవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తే.. ఈ ఇద్దరూ కలిస్తే, అది ఇంకెంత రచ్చరంబోలానో ఊహించడం కష్టమేననిపిస్తోంది. అవును పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ ట్రైలర్ నేడు ఆడియెన్స్ ముందుకొచ్చేసింది.

రామి పోతినేని హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది. ఇప్పటివరకు రామ్ ఎన్నో సినిమాల్లో మాస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ.. ఇస్మార్ట్ శంకర్ తరహాలో మాత్రం ఎప్పుడూ చేయలేదని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డైలాగ్స్, రామ్ గెటప్ వంటి అంశాలన్నీ పూరి జగన్నాథ్ మార్క్ తలపిస్తున్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.

Also watch : ఆకట్టుకుంటున్న రణరంగం టీజర్

 

Read More