Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

వైఎస్ జగన్ రిలీజ్ చేయనున్న 'ఇదం జగత్' టీజర్

రేపు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ కానున్న ఇదం జగత్ టీజర్ 

వైఎస్ జగన్ రిలీజ్ చేయనున్న 'ఇదం జగత్' టీజర్

సుమంత్ నటిస్తున్న కొత్త సినిమా ఇదం జగత్ టీజర్ రేపు విడుదల కానుంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రేపు ఉదయం ఈ టీజర్ ని విడుదల చేయనున్నారు. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్స్‌పై పద్మావతి జొన్నలగడ్డ, గంగపట్నం శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అనిల్ శ్రీ కంఠం డైరెక్ట్ చేస్తున్నాడు. కేరళకు చెందిన అంజు కురియన్ అనే హీరోయిన్ తెలుగు సినిమాకు పరిచయం అవుతోంది.
  
ఈ సినిమాలో సుమంత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదం జగత్ యూనిట్ చెబుతోంది. సుమంత్ మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాడు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్ర పోషిస్తున్నారు. 

Read More