Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

నోకియా 2 ఫోన్ రూ.6999కే.. ఇంటర్నెట్ డేటా ఫ్రీ

నోకియా 2 ఫోన్ రూ.6999కే.. ఇంటర్నెట్ డేటా ఫ్రీ

నోకియాకి చెందిన సరికొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చింది. ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్న కేవలం రూ.6999 మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలో ఈ రోజు నుంచి నోకియా 2 అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నోకియాను సొంతం చేసుకున్న హెచ్ఎండీ గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. ఈ క్రమంలో నోకియా 2 స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది.
 
ఫోన్ తో ఇంటర్నెట్ డేటా ఫ్రీ...
నోకియా 2 ఫోను కొనుగోలు చేసిన వారికి  45 జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియోతో కలిసి బండిల్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే ఎయిర్ టెల్ - కార్బన్ సంస్థలు బండిల్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దీంతో పాటు కాంప్లిమెంటరీ కింద ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ బీమాను కల్పిస్తోంది. 

నోకియా 2 ఫీచర్లు ఇవే...
* 5 అంగుళాల డిస్‌ప్లే
* 8 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 1 జీబీ ర్యామ్
* 8 జీ బీ ఇంటర్నల్ మెమొరీ
* 128 జీబీ వరకు ఎక్స్‌టర్నల్ మెమొరీ
* 4100 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ
*  ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓస్

Read More