Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

7 మిలియన్స్ స్టార్ మహేష్ స్వీట్ ట్వీట్ ..ఫాలోవర్స్ ఫిదా

                                 

7 మిలియన్స్ స్టార్ మహేష్ స్వీట్ ట్వీట్ ..ఫాలోవర్స్ ఫిదా

సౌత్ ఇండియాలో టాప్ ఫాలోవర్లను కలిగిన సినీ హీరోల్లో టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ బాబు ఒకరిగా నిలిచాడు. ఆయనను ట్విటర్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య అక్షరాల 7 మిలియన్ల ( 70 లక్షలు)కు చేరుకుంది.  ఈ సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులకు ఓ స్వీట్ స్వీట్ చేశాడు.. ‘మీ ఆదరణకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. లవ్ యు ఆల్’ అని ట్వీట్ చేశాడు. దీనికి  ‘థ్యాంక్స్ టు ట్వీపుల్’ అని సంతకం చేసిన తన పిక్‌ ను పోస్టు చేశాడు. దీనికి ‘7మిలియన్ మహేషియన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. మహేష్ స్వీట్ ట్వీట్ కు  ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.. ఆయన ట్వీట్ కు రిప్లై ఇస్తూ తమ సంతోషాన్ని  పంచుకుంటున్నారు

ట్విటర్‌లో అకౌంట్ తెరిచి దాదాపు 8 ఏళ్లవుతున్న హ్యాండ్‌సమ్ హీరో కు  అక్షరాలా 70 లక్షల ఫాలోవర్లతో ఉండటం గమనార్హం. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మహేష్..ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటున్నాడు. ఈ కారణం చేత ట్విట్టర్ లో ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిపోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

 

Read More