Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Summer food: ఎండాకాలంలో వేడిని తగ్గించే ఆహారాలు ఇవే..!

Healthy food: వేసవి వచ్చేసింది. భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మెుదలుపెట్టాడు. ఈ సీజన్ లో మీరు ఎక్కువగా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. ఎండాకాలంలో మీరు ఆరోగ్యం ఉండాలంటే ఈ కింది పుడ్ ను తీసుకుంటే చాలు.
 

Summer food: ఎండాకాలంలో వేడిని తగ్గించే ఆహారాలు ఇవే..!

Summer special food: వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎందుకంటే మండే ఎండలు, వేడిగాలులు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుడ్ తీసుకోవాలి. ఎండాకాలంలో హెల్తీగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పక తినాలి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

సమ్మర్ పుడ్.. హెల్త్ గుడ్
** మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవిలో దీనిని తీసుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. అంతేకాకుండా ఇది డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేస్తుంది. 
** ఆకుకూరలు హెల్త్ కు ఎంతో మేలు చేస్తాయి. బాడీలోని వేడిని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
** నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలోని వేడి అంతా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది నిపుణులు నిమ్మరసం తాగమని చెబుతారు.
** నారింజలో విటమిన్ సి, ఫైబర్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో 85 శాతం నీరే ఉంటుంది. ఎండా కాలంలో దీనిని తీసుకోవడం వల్ల మీకు శరీరరంలో నీటి కొరత అనేది ఉండదు. 
** కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని వేసవిలో తీసుకుంటే బాడీలోని హీట్ తగ్గడమే కాకుండా.. ఎన్నో పోషకాలు అందుతాయి. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: How To Reduce Cholesterol: వేగంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆయుర్వేద మూలికలు ఇవే..! 6 రోజుల్లో చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More