Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసిన ఫరాన్

బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ తన ఫేస్బుక్ అకౌంట్‌ని పర్మినెంట్‌గా డిలీట్ చేశారు.

ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసిన ఫరాన్

బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ తన ఫేస్బుక్ అకౌంట్‌ని పర్మినెంట్‌గా డిలీట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే కేంబ్రిడ్జి అనాలిటికా అనే సంస్థ ఫేస్సుక్‌లో వ్యక్తిగత వివరాలకు భంగం కలిగిస్తుందనే వార్త తెలియగానే... కొన్ని వేలమంది తమ ఖాతాలను డిలీట్ చేశారు. ఈ క్రమంలో నటుడు ఫరాన్ అక్తర్ కూడా తన ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే ఓ ప్రకటన చేశారు.

తాను ఖాతా డిలీట్ చేసినా.. ఇంకా వెరిఫైడ్ పేజీ యాక్టివ్‌లో ఉండడమేంటని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎందరో హాలివుడ్ నటులు తమ ఫేస్బుక్ అకౌంట్లను డిలీట్ చేశారు. అందులో జస్టిన్ బీబర్, రిహానా, ఎమ్మా స్టోన్, కెండెల్ జెన్నర్ లాంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. కేంబ్రిడ్జి అనాలిటికా ఉదంతం బహిర్గతం అయ్యాక.. డిలీట్ ఫేస్బుక్ క్యాంపైన్ అదే సోషల్ మీడియా సైటులో వైరల్ కావడం గమనార్హం

Read More