Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అప్పట్లో షారుఖ్ కు బిగ్ బి సెగ... ఇప్పుడు రణవీర్ కు కింగ్ ఖాన్ పరీక్ష!

బాలీవుడ్ లో డాన్ సీక్వెల్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. 1970 డాన్ సినిమాలో అభితాబ్ నటించగా.. తరువాత డాన్ సీక్వెల్ లో షారుఖ్ నటించాడు. అయితే ఫరాన్ అక్తర్ మాత్రం ఇపుడు వచ్చే డాన్ రణవీర్ సింగ్ ని ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో బాలీవుడ్ లో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అప్పట్లో షారుఖ్ కు బిగ్ బి సెగ... ఇప్పుడు రణవీర్ కు కింగ్ ఖాన్ పరీక్ష!

తెలుగు వారికి అప్పట్లో బాగా తెలిసిన చిత్రం ఎన్టీఆర్ 'యుగంధర్'. ఈ తరం వారికి బాగా తెలిసిన అలాంటి చిత్రమే 'బిల్లా'. అసలు ఈ రెండు సినిమాలకు ప్రేరణ ఏదో తెలుసా? 1978 నాటి కల్ట్ బాలీవుడ్ మూవీ 'డాన్'. అందులో అమితాబ్ బచ్చన్ నటన, పాటలు, ఆటలు, డైలాగ్స్ ఇప్పటికీ క్రేజీగా కొనసాగుతుంటాయి. అయితే అనేక భాషల్లో మాఫియా డాన్ చిత్రాలకు మూలంగా నిలిచిన ఒకప్పటి బాలీవుడ్ డాన్ మూవీ మళ్లీ మళ్లీ రీమేకులు, సీక్వెల్సు అయింది! అలా పుట్టుకొచ్చినవే.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'డాన్' ఫ్రాంఛైజీ సినిమాలు. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో బాక్సాపీస్ బద్ధలు కొట్టిన బాలీవుడ్ బాద్షా చిత్రాలు అనేక మందికి హాట్ ఫేవరెట్స్. అయితే, త్వరలో బాలీవుడ్ తెరపైకి మూడో డాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒరిజినల్ డాన్ బిగ్ బి కాగా... ఆయన పాత్రలోకి రాయల్ గా ఎంట్రీ ఇచ్చాడు కింగ్ ఖాన్. 

ఇప్పుడు ముచ్చటగా మూడో డాన్ వేషం కట్టబోతున్నాడు రణవీర్ సింగ్. ఫర్హాన్ అఖ్తర్ ఈ మధ్యే రణవీర్ సింగ్ తన నెక్ట్స్ 'డాన్' అంటూ ప్రకటించేశాడు. అప్పటి నుంచీ సొషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షారుఖ్ ఫ్యాన్స్ తమ హీరోని డాన్ ఫ్రాంఛైజ్ నుంచీ తప్పించటంతో డిజపాయింట్ అవుతున్నారు. రణవీర్ కి కింగ్ ఖాన్ అంత సీన్ లేదంటున్నారు! హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాటలు ఎలా ఉన్నా మిగతా వారు మాత్రం రణవీర్ సింగ్ ను డాన్ గా చూసేందుకు బాగానే ఆసక్తి చూపుతున్నారు. 

ఇక రణవీర్ కూడా తన సొషల్ మీడియా అకౌంట్లో అమితాబ్, షారుఖ్ ఇద్దర్నీ తలుచుకున్నాడు. వారి సినిమాలు చూస్తూ తాను పెరిగి, పెద్దవాడ్ని అయ్యానని అంటున్నాడు. బిగ్ బి, బాద్షా వంటి లెజెండ్రీ యాక్టర్స్ చేసిని రోల్ లో తాను కనిపించటం సాహసం అంటూనే... ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు, సత్తా చాటుతానని కూడా ఇండైరెక్ట్ గా ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఫర్హాన్ అఖ్తర్ 'డాన్' సిరీస్ లో నెక్ట్స్ మూవీపై మరింత ఇంట్రస్ట్ నెలకొంది. అదే సమయంలో కరణ్ జోహర్ 'కాఫీ విత్ కరణ్' టీవీ షోకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ కూడా రైట్ నౌ వైరల్ అవుతోంది. 

Also Read: ND vs IRE Dream11 Prediction Today: క్లీన్‌స్వీప్‌కు బుమ్రా సేన రెడీ.. డ్రీమ్‌ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  

అందులో అమితాబ్ చేసిన 'డాన్' క్యారెక్టర్ లో తాను కనిపించటంపై ఎస్ఆర్కే స్పందించాడు! బిగ్ బి చేసిన డాన్ సినిమా రీమేక్ లో షారుఖ్ నటిస్తాడని అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు కూడా జనం గగ్గోలు పెట్టారు. సీనియర్ బచ్చన్ కు ఉన్నంత సీన్ ఖాన్ కు ఉండదంటూ విమర్శలు చేశారు. అప్పుడు కరణ్ తన షోలో ఓ ప్రశ్న వేశాడు. "ఒక వేళ నువ్వు 1970ల నాటికి... వెనక్కి వెళ్లిపోతే... ఏం చేస్తావు?" అంటూ షారుఖ్ ని ప్రశ్నించాడు. 

నేను చంద్రా బారెట్ తో 'డాన్' సినిమా చేస్తాను. అలా ఇప్పుడు నెలకొంటోన్న వివాదాలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను'' అని జవాబిచ్చాడు!
చంద్రా బారెట్ ఒరిజినల్ 'డాన్' మూవీ డైరెక్టర్. అదే దర్శకుడితో సినిమా చేస్తానని షారుఖ్ 'కాఫీ విత్ కరణ్‌'లో చెప్పాడు. ఇక సీన్ కట్ చేస్తే.... అమితాబ్ పాత్రలోకి ఎస్ఆర్కే వచ్చినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయో... ఇప్పుడూ అదే జరుగుతోంది. షారుఖ్ లాగా రణవీర్ చేయలేడంటూ కొందరు సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. చూడాలి మరి, "డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ... నా ముమ్కిన్ హై!" అంటాడు అమితాబ్. అయినా, 'డాన్' ని ఒడిసి పట్టుకున్నాడు షారుఖ్. ఇప్పుడు అదే 'డాన్'ని నేను కూడా తన టాలెంట్ తో 'పట్టేస్తా'నంటున్నాడు రణవీర్! చూద్దాం... మూడో తరం 'డాన్' పోలీసుల్ని ముప్ప తిప్పలు పెడతాడో, థియేటర్ కు వచ్చిన జనాన్ని బెంబేలెత్తిస్తాడో!

Also Read: Weight Control Tips: రోజూ ఈ 5 పద్దతులు ఫాలో అయితే, జిమ్ అవసరం లేకుండానే అధిక బరువుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More