Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

నవంబర్ 19న దీపికా పదుకునె - రణ్‌వీర్ సింగ్‌ పెళ్లి ?

మళ్లీ తెరపైకొచ్చిన రణ్‌వీర్ సింగ్ -  దీపికా పదుకునె పెళ్లి 

నవంబర్ 19న దీపికా పదుకునె - రణ్‌వీర్ సింగ్‌ పెళ్లి ?

బాలీవుడ్ హిట్ పెయిర్, లవ్ బర్డ్స్ రణ్‌వీర్ సింగ్ -  దీపికా పదుకునె పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఇద్దరికీ సంబంధించిన పెళ్లి వార్త మరోసారి తెరపైకొచ్చింది. ఫిలింఫేర్ మ్యాగజైన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం దీపికా పదుకునె, రణ్‌వీర్ సింగ్ నవంబర్ 19న పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అటు రణ్‌వీర్ సింగ్ కానీ లేదా ఇటు దీపికా పదుకునే కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఆ ఇద్దరి నుంచి దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడితే కానీ అసలు విషయం ఏంటో తెలిసే ఛాన్స్ లేదు. పెళ్లి విషయమై ఇటీవల రణ్‌వీర్ సింగ్‌ని వివరణ కోరగ్గా.. అటువంటిదేం లేదని కొట్టిపారేశాడు. "ఒకవేళ అటువంటి గుడ్ న్యూస్ ఏదైనా వుంటే, తానే ముందుగా అందరికీ చెబుతాను" అని రణ్‌వీర్ సింగ్ స్పష్టంచేశాడు. అలా అనీ ఈ ఇద్దరి పెళ్లి వార్తల్ని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్‌లో పీకల్దాకా ప్రేమలో మునిగిన జంట ఏదైనా వుంటే అది ఈ జంటే.

ఇటీవల కాలంలో బాలీవుడ్ జంటల వివాహం ట్రెండ్ నడుస్తోంది. ఇదే మే నెలలో సోనమ్ కపూర్-ఆనంద్ అహుజ, నేహా దూపియా-అంగన్ బేడీ, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రేషమ్మియా-సోనియా కపూర్ జంటలు సైతం వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే

Read More