Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Coronavirus Vaccine: కరోనావైరస్‌కు తొలి వ్యాక్సిన్ సిద్ధమా ?

Coronavirus vaccine: కరోనా వ్యాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో నైజీరియా ( Nigeria ) నుంచి వస్తున్న వార్త ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ దేశ శాస్త్రవేత్తలు కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్టు పక్కా సమాచారం అందుతోంది.

కరోనావైరస్ వ్యాక్సిన్ ( Coronavirus ) కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, జపాన్, చైనా, ఆస్ట్రేలియాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అహర్నిశలూ ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో రెండో దశల్లో ట్రయల్స్ జరుగుతుంటే మరి కొన్ని దేశాల్లో తొలి దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం 13 రకాల వ్యాక్సీన్స్ హ్యూమన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నైజీరియా శాస్త్రవేత్తలు బృందం ఒకటి కరోనాకు వ్యాక్సీన్  కనుగొన్నట్టు ది గార్డియన్ నైజిరియా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఆఫ్రికన్ల కోసం ఆఫ్రికాలో ఈ వ్యాక్సీన్‌ను కొనుగొన్నట్టు ఒసన్ ( OSUN  STATE ) లోని అడిలెక్ యూనివర్శిటీ ( ADELEKE UNIVERSITY ) మెడికల్ వైరాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ నిపుణుడు డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించినట్టు ది గార్డియన్ నైజీరియా ( THE GUARDIAN NIGERIA ) ప్రచురించింది. నైజీరియా శాస్త్రవేత్తల బృందానికి డాక్టర్ ఒలడిపోనే నేతృత్వం వహించారు. సార్స్ కొవ్ 2 జినోమ్ కోసం ఆఫ్రికా అంతటా అణ్వేషించామని... మరింత విశ్లేషణ అవసరమైన నేపధ్యంలో అందుబాటులో రావడానికి 18 నెలల సమయం పడుతుందన్నారు డాక్టర్ ఒలడిపో కొలవోల్. 

ఇబడాన్ ( IBADAN ) లోని ప్రీసియస్  కార్నర్ స్టోన్ యూనివర్శిటీ ( PRECIOUS CORNERSTONE UNIVERSITY ) ప్రొఫెసర్ జూలియస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. వ్యాక్సీన్ తయారు చేసింది నిజమేనని... ఆఫ్రికన్లే లక్ష్యంగా దీన్ని కనుగొన్నామని.. అయితే అందరూ వినియోగించవచ్చని జూలియస్ స్పష్టం చేశారు.

Read More