Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Rashmika Mandanna: దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక..రెమ్యునరేషన్‌ తెలుస్తే అంతా షాకే..!

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక జోరు పెంచింది. వరుసగా సినిమాలకు ఓకే చెబుతోంది. తాజాగా పారితోషికాన్ని భారీగా పెంచింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rashmika Mandanna: దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక..రెమ్యునరేషన్‌ తెలుస్తే అంతా షాకే..!

Rashmika Mandanna: పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హిట్‌ను రష్మిక తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో శ్రీవల్లిగా అదరగొట్టింది. ఒకే ఒక చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది. పుష్ప మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతంలో పలు భాషాల చిత్రాలకు వరుసగా ఓకే చెబుతోంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ దూసుకెళ్తోంది రష్మిక . తాజాగా రూట్‌ మార్చి ప్రత్యేక రోల్‌ చేసేందుకు సైతం ఆసక్తి చూపుతోంది. 

తాజాగా సీతారామం మూవీలో ప్రత్యేక క్యారెక్టర్‌లో మెరిసింది శ్రీవల్లి రష్మిక. ఈసినిమాలో ముస్లిం యువతి అఫ్రిన్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఈ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శుక్రవారం విడుదలయిన ఈ మూవీ మంచి హిట్‌తో దూసుకుపోతోంది. పుష్ప-2 చిత్రంలో రష్మిక బిజీ బిజీగా ఉంది. దీనితోపాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. దీంతో ఒక్కసారిగా రష్మిక తన రెమ్యునరేషన్‌ను పెంచింది. పుష్పకు ముందు వరకు రూ.కోటి పారితోషికం తీసుకుంది.

ఈమూవీ బంపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఏకంగా రెమ్యునరేషన్‌ను డబుల్ చేసింది. ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం అడుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలకు రూ.4 కోట్లు, తెలుగు సినిమాలకు రూ.3 కోట్ల పారితోషికం ఇవ్వాలని నిర్మాతల ముందు తన వాదన ఉంచినట్లు చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత రష్మిక హవా నడుస్తుండటంతో రెమ్యునరేషన్‌ ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 

ప్రస్తుతం ఓ సినిమా తెరపైకి రావడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇందులో సినిమా మేకింగ్ కంటే హీరో హీరోయిన్, దర్శకుల పారితోషికానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. దీంతో చాలా మంది నిర్మాతలు మేకింగ్ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇదే అంశం వివాదస్పదవుతోంది. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్‌ తగ్గించాలని నిర్మాతలు కోరుతున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లు సైతం నిలిచిపోయాయి. 

Also read:Flipkart Offers: శాంసంగ్ రెడీ LED టీవీ మరి ఇంత డెడ్ చీపా..? రూ. 3,990లకే టీవీ.!

Also read:Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More