Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

వాళ్ల గొడవల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన చిరంజీవి ?

గొడవల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన చిరంజీవి ?

వాళ్ల గొడవల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన చిరంజీవి ?

మా అసోసియేషన్‌లో సుమారు కోటి రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అసోసియేషన్ సభ్యుడైన సీనియర్ హీరో నరేష్ చేసిన ఆరోపణలకు అసోసియేషన్ ప్రతినిధులు అంతే తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాను మా అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశానని ఆధారాలతో సహా నిరూపిస్తే, తన యావదాస్తి ఇచ్చేస్తానని మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించడం, ఆరోపణలు నిజమని రుజువైతే తాను మా అసోసియేషన్ గడప కూడా తొక్కనని ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ సవాల్ విసరడం వంటివి ఈ వివాదాన్ని తారాస్థాయికి చేర్చాయి. దీంతో ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో హీటెక్కుతున్న మా అసోసియేషన్ వాతావరణాన్ని చల్లబరిచి సమస్యను పరిష్కరించేందుకు నేరుగా మెగాస్టార్ చిరంజీవినే రంగంలోకి దిగాడనే టాక్ వినిపిస్తోంది. 

కొన్ని నెలల క్రితం అమెరికాలో జరిగిన మా సిల్వర్ జూబ్లీ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులే దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇప్పుడు చిరంజీవే రంగంలోకి దిగి సమస్యను సద్దుమణిచేందుకు ప్రయత్నించడం పరిశ్రమలో చర్చనియాంశమైంది. మరి ఒకవేళ నిజంగానే మా అసోసియేషన్ నిధులు దుర్వినియోగం అయితే, చిరంజీవి రంగప్రవేశంతో ఆ నిధులు వెలికివస్తాయా ? లేక ఆ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని నిరూపించి మా అసోసియేషన్ ప్రతినిధులే తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటారా వేచిచూడాల్సిందే మరి!

Read More