Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Union Budget 2023: బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యం ఎంతో తెలుసా..? అసలు నిపుణుల అంచానాలేంటి..?

Union Budget 2023: విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సారి బడ్జెట్‌లో ద్రవ్య లోటును 5.8% నుంచి 6% పరిధిలో ఉంచవచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును స్థూల జీడీపీలో 6.4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

Union Budget 2023: బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యం ఎంతో తెలుసా..? అసలు నిపుణుల అంచానాలేంటి..?

Union Budget 2023: వచ్చే నెలలో రాబోయే బడ్జెట్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ఏకీకరణ దిశగా వెళ్తున్నారని.. ఆర్థిక లోటును జిడిపిలో 5.8 శాతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం..2023 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ద్రవ్య లోటు 24 5.8 శాతం నుంచి 6 శాతం పరిధిలో ఉంచవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 6.4 శాతంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఈ బడ్జెట్ ప్రభుత్వానికి చివరి పూర్తి బడ్జెట్ కావడంతో ఇందులో కొత్త ప్రకటనలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్‌ కారణంగా  రెండేళ్లలో ఆర్థిక లోటు 9.3 శాతానికి పెరిగింది. అయితే దీనిపై HSBC ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ప్రంజూల్ భండారీ స్పందిస్తూ..“రాబోయే కొన్నేళ్లలో ఆర్థిక ఏకీకరణ మార్గాన్ని అనుసరించడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తొందని..ఇది లాంగ్ డిస్టెన్స్ సైకిల్ రేస్ లాంటిదని.. అకస్మాత్తుగా ఆగిపోతే పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారతదేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి ద్రవ్యలోటు తగ్గింపు ముఖ్యమని.. అనిశ్చిత ప్రపంచ వాతావరణంలో ఇది మరింత ముఖ్యమైనదని నిపుణులు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1న సమర్పించనున్న సాధారణ బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ఆరు శాతంగా ఉంచుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆర్థిక ఏకీకరణ బాటలో పయనించేందుకు ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సవాల్‌గా నిలుస్తుందని తెలుపుతున్నారు.

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యయంలో 8.2 శాతం పెరుగుదలతో పాటు, ఆదాయ వృద్ధి 12.1 శాతంగా కూడా వారు అంచనా వేశారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ద్రవ్య లోటు లక్ష్యాన్ని 5.9 శాతానికి అంచనా వేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు కూడా రూ.15.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంది. అయితే ఫిబ్రవరి చివరి నెల దాకా అన్ని వేచి చూడాల్సిందే..

Also read: Sunil Jailer Look : ఇదేం లుక్‌రా బాబోయ్.. రజినీకాంత్‌ను ఢీ కొట్టనున్న సునిల్

Also read: Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More