Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

"RRR" కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చిన రామ్ చరణ్ !!

రాజమౌళి దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి  డైరక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రూపొందుతోంది 'ఆర్ఆర్ఆర్' మూవీ . ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఆలియా భట్ కాగా... మరో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. బాహుబలి తరహా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తవడానికి చాలా టైం పడుతుందని చిత్ర యూనిట్ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే ఈ మూవీ ఎప్పుటి కల్లా రిలీజ్ అవుతుందనే దానిపై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.

ఈ సస్పెన్స్ కు తెరదించుతూ ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. తాను , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న '' RRR '' మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ( 2020, జూన్ 30న) అవుతుందని తెలిపాడు. తాను అల్లూరి సీతారామ రాజు ప్రాతలో..ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నట్లు తెలిపాడు మెగా పవర్ స్టార్.ఇలా రామ్ చరణ్ చెప్పిన గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

 

Read More