Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఇష్టం లేకున్నా.. 'సైరా'కోసం ఒప్పుకున్నా: బిగ్‌బి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా న‌టిస్తున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'.

ఇష్టం లేకున్నా.. 'సైరా'కోసం ఒప్పుకున్నా: బిగ్‌బి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా న‌టిస్తున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో సైరా న‌ర‌సింహ‌రెడ్డి గురువు పాత్రలో బిగ్‌బి అమితాబ్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న త‌న పాత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా సైరా మూవీలోని త‌న పాత్ర గురించి బిగ్‌బి త‌న బ్లాక్ లో రాస్తూ, గతంలో తాను ఏదైతే చేయకూడదని వాగ్దానం చేసుకున్నానో చిరంజీవి ‘సైరా’ చిత్రం కోసం దాన్ని మీరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏ సినిమాలో కూడా ఇక విగ్గు, గడ్డం పెట్టుకుని నటించరాదని తాను గతంలో అనుకున్నానని, ఇప్పుడు ‘సైరా’ కోసం తిరిగి విగ్గు పెట్టుకోవాల్సి వచ్చిందని, గడ్డం తగిలించుకున్నానని చెప్పారు. దీంతో తన సినీ జీవితంలో మరోసారి నరకాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత అవసరాల రీత్యా కొన్నిసార్లు ఇటువంటివి తప్పవని వ్యాఖ్యానించారు

ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం అమితాబ్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉన్నారు. బంజారా హిల్స్‌లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో బస చేశారు. హోటల్‌ నుంచి సెట్స్‌కి రావడానికి వీలుగా అమితాబ్‌కు చిరు తన రోల్స్‌ రాయిస్‌ కారును ఇచ్చారట. రెండు రోజుల పాటు చిరు కారును అమితాబ్‌ తన వద్దే ఉంచుకున్నారు. ఇటీవల మెగాస్టార్‌ కుటుంబం బిగ్‌బి బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయన్ను కలిసినట్లు సమాచారం

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

.

Read More