Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

‘అల వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ(4.5/5): బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో అల వైకుంఠపురంలో మాత్రం కాస్త స్పెషల్. ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్లు ఇచ్చిన బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ తాజాగా హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంది.

‘అల వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ(4.5/5): బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ అదిరిపోయింది. గత చిత్రం ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావటంతో కాస్త గ్యాప్ తీసుకుని మరి బన్నీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ ఇచ్చిన బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి సూపర్ హిట్ అయింది.

ఎంటర్ టైన్మెంట్, డ్యాన్స్, ఎమోషనల్ సీన్లు అల్లు అర్జున్ బలమని, త్రివిక్రమ్ వాటి ఆధారంగా చితక్కొట్టేశాడని.. కత్తి దింపడం మాత్రం జల్సాను గుర్తు చేసిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మరో సక్సెస్ కొట్టిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో అంటున్నారు. ఈ సంక్రాంతికి బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని కామెంట్ చేస్తున్నారు.

కొన్ని మెలోడ్రామాటిక్ సన్నివేశాలు తప్పితే.. సెకండాఫ్ బన్నీ కుమ్మేశాడట. విజువల్స్ చాలా బాగా చూపించారు. టీమ్ మొత్తం ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ కూడా హైలైట్. ముఖ్యంగా బోర్డ్ రూమ్ సీన్ అన్నింటికి మించి హైలైట్ అని బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

ఫస్టాఫ్‌లో కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సూపర్ అని చెబుతున్నారు ఫ్యాన్స్. స్టైలిష్ స్టార్ బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తమన్‌ మ్యూజికల్ హిట్లలో ఒకటిగా నిలుస్తోంది.

 

Read More