Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఏబీవీపీ జెండాతో అక్షయ్ కుమార్..!

బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'పాడ్‌మాన్‌' మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. 

ఏబీవీపీ జెండాతో అక్షయ్ కుమార్..!

బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'పాడ్‌మాన్‌' మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా అక్షయ్ సోమవారం డియూలో ఒక కళాశాలలో నిర్వహించిన మహిళా మారథాన్ లో పాల్గొని మహిళా సాధికారికతకు మద్దతు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. 

ఈ ఫోటోలో, అక్షయ్ బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపి(ABVP)జెండా కర్రను చేత్తో పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండడని సలహా కూడా ఇచ్చారు. అక్షయ్ అభిమానులు తమ హీరో ఇమేజ్ ను డామేజ్ చేయడానికే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ నెల 25వ తేదీన 'పాడ్‌మాన్‌'ను రిలీజ్ చేయాలనుకున్నా.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' రిలీజ్ అవుతుండటంతో ఫిబ్రవరి 9కి సినిమా విడుదలను వాయిదా వేశారు.

 

Read More