Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Memories Video Song: సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' మ్యూజిక్ వీడియో విడుదల.. మీరూ ఓ లుక్కేయండి..

Sudhakar Komakula Memories Song: యువ నటుడు సుధాకర్ కోమాకుల నటిస్తూ.. సొంత బ్యానర్‌లో నిర్మించిన వీడియో సాంగ్ 'మెమొరీస్'. ఈ సాంగ్‌ ఫుల్ వీడియోను హీరో అడివి శేషు చేతుల మీదుగా విడుదల చేశారు. మీరూ ఓ లుక్కేయండి..  
 

 Memories Video Song: సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' మ్యూజిక్ వీడియో విడుదల.. మీరూ ఓ లుక్కేయండి..

Sudhakar Komakula Memories Song: రీసెంట్‌గా నారాయణ అండ్ కో చిత్రంతో అలరించిన యువ నటుడు సుధాకర్ కోమాకుల.. 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో అలరించనున్నాడు. ఈ సాంగ్‌ను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించగా.. తాజాగా నటుడు అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మేకర్స్‌ను ఆయన అభినందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఫుల్‌ సాంగ్‌కు కూడా చక్కటి ఆదరణ లభిస్తోంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించి ఈ సాంగ్.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేవిధంగా ఉంది. ఈ పాటలోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటోంది. లైఫ్‌లో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసేవిధంగా రూపొందించారు. 

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో చిత్రీకరించారు. రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో సరికొత్తగా తెరకెక్కించారు. మెమొరీస్ వీడియో సాంగ్‌ను తెలుగుతోపాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రూపొందించారు. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సాంగ్ ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం డైరెక్షన్‌లో తెరకెక్కింది. 

సైమా అవార్డ్స్‌కు నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలిమ్‌కు అన్వేష్‌ కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేశాడు. సోనీ మ్యూజిక్‌లో రిలీజ్ అయిన 'మనోహరం' అనే షార్ట్ ఫిలిమ్‌కు రైటర్‌గా.. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా  పనిచేశాడు. మెమోరీస్ వీడియో సాంగ్‌లో వరుణ్ అనే యువకుడి కథను పరిచయం చేస్తూ.. ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అనే విషయాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించారు. సాంగ్‌లోని విజువల్స్‌ కనులవిందుగా చూపించారు. మ్యూజిక్, కాన్సెప్ట్ ట్రెండీగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రియల్ వరల్డ్‌లో 2డీ యానిమేషన్ క్యారెక్టర్ జెస్సికా నీలో చేసిన ప్రయోగం తప్పకుండా నచ్చుతుంది. 

ఈ సాంగ్‌ను అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేయగా.. తెలుగులో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించాడు. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. సింపుల్ హుక్ స్టెప్‌తో ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా డిజైన్ చేశారు. రితేష్ జి రావు  హిందీలో పాడగా.. అర్జున్ విజయ్ (మలయాళం), సుస (తమిళ్) గాత్రం అందించారు. ఎడిటర్‌గా శ్రీకాంత్ ఆర్ పట్నాయక్ వ్యవహరించారు.

Also Read:  Michaung Cyclone: తుపాను ప్రభావం తీవ్రమే, అతి భారీ వర్షాల హెచ్చరిక, ప్రభుత్వం అలర్ట్

Also Read:  Oneplus 10T Price: అమెజాన్‌లో OnePlus 10T 5G మొబైల్‌ను రూ.9,699కే పొందండి..ఫీచర్స్‌, ఇతర వివరాలు!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More