Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Poonam Pandeys Husband Sam Bombay: భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన నటి పూనమ్ పాండే

Poonam Pandey Molestation Case: భర్త వేధిస్తున్నాడని బాలీవుడ్ నటి పూనమ్ పాండే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను అరెస్ట్ చేశారు.

Poonam Pandeys Husband Sam Bombay: భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన నటి పూనమ్ పాండే

సినిమాల కన్నా తన బోల్డ్‌నెస్, ఇతరత్రా విషయాలతోనే వార్తల్లోకెక్కే నటి పూనమ్ పాండే (Poonam Pandey). ఆమె వైవాహిక జీవితం అప్పుడే డైలామాలో పడిపోయింది. పెళ్లి చేసుకున్న 3 వారాలకే పోలీసులను ఆశ్రయించింది నటి పూనమ్ పాండే. భర్త సామ్ బాంబే (Sam Bombay) తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, దాడిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గోవా పోలీసులను ఆశ్రయించింది. బాలీవుడ్ పూనమ్ పాండే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆమె భర్త సామ్ బాంబేను అరెస్ట్ (Poonam Pandeys husband Sam Bombay arrested) చేసి విచారణ చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. నటి పూనమ్ పాండే హాట్ ఫొటోలు, వీడియోలు, బోల్డ్ అంశాలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. సామ్ బాంబేతో ప్రేమలో పడిన పూనమ్ పాండే మూడు వారాల కిందట (సెప్టెంబర్ 1న) అతడ్ని సీక్రెట్‌గా పెళ్లి (Poonam Pandey Wedding) చేసుకుంది. కరోనా వ్యాప్తి సమయం అయినా సామ్ బాంబే, పూనమ్ పాండే వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సినిమా షూటింగ్ కోసం దక్షిణగోవాలోని కనాకోనాకు పూనమ్ వెళ్లగా భర్త సామ్ బాంబే సైతం ఆమె వెంట ఉన్నారు. 

ఈ క్రమంలో పూనమ్ పాండే పీఎస్‌కు వచ్చి భర్తపై లైంగిక వేధింపులు (Poonam Pandey Molestation Case), హత్యాయత్నం బెదిరింపులు ఆరోపణలు చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసిందని ఇన్‌స్పెక్టర్ తుకారం చవాన్ తెలిపారు. పూనమ్ పాండే ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామ్‌ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్ట్‌ చేశారు. పూనమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లవ్ మ్యారేజీ చేసుకున్న జంట 3 వారాల్లోనే గొడవ ఎలా మొదలైంది, అసలేం జరిగింది అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారు. Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More