Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Nithin Bheeshma Teaser: భీష్మ టీజర్.. నితిన్ టైమింగ్ సూపర్

శ్రీనివాస కళ్యాణ్యం తర్వాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. ఇందులో నితిన్‌కు జోడీగా రష్మిక నటిస్తోంది. తాజాగా భీష్మ టీజర్ విడుదలైంది.

Nithin Bheeshma Teaser: భీష్మ టీజర్.. నితిన్ టైమింగ్ సూపర్

యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భీష్మ. చార్మింగ్ బ్యూటీ రష్మిక మందన నితిన్‌కు జోడీగా నటిస్తోంది. తాజాగా విడుదలైన భీష్మ టీజర్ నవ్వులు పూయిస్తోంది. నిమిషం నిడివి ఉన్న టీజర్‌లో నితిన్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఆదివారం విడుదలైన భీష్మ టీజర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం టచ్ చేసింది. పంచ్‌లతో కూడిన టీజర్‌తో నితిన్ ఆకట్టుకున్నాడు.

నీ పేరెంటని నితిన్‌ను ‘మిర్చి’ సంపత్ అడిగితే.. భీష్మ అని నితిన్ బదులిస్తాడు. భీష్మ కాదు.. భీష్మ సర్ అనాలి అని సంపత్ అంటాడు. నా పేరుకి సర్ యాడ్ చేస్తే అంతగా బాగోదేమో అనే పంచ్ సరిగ్గా పేలింది. సంపత్ అసిస్టెంట్ బాగా షాకవుతాడు. ఏం చేస్తుంటావని అడిగితే రష్మికకు అయితే ఐఏఎస్, ఐపీఎస్ అని.. బయటివ్యక్తులకు అయితే మీమ్స్ చేస్తుంటానని చెబుతుంటాడు. నా అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయ అంత ఉందండి' అనే కొటేషన్‌తో టీజర్ పూర్తవుతుంది.

భీష్మ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్ ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ సెలెక్ట్ చేసుకుని చేస్తున్న సినిమా భీష్మ.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More