Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

నచ్చినవాడు సినిమా నుంచి పాట విడుదల చేసిన శ్రీమతి అక్కినేని అమల

లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ.. తనే దర్శకత్వం వచిస్తున్న చిత్రం 'నచ్చినవాడు'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలోని ఒక పాటను అక్కినేని అమల విడుదల చేసారు. ఆ వివరాలు

నచ్చినవాడు సినిమా నుంచి పాట విడుదల చేసిన శ్రీమతి అక్కినేని అమల

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం "నచ్చినవాడు". ఇటీవలే విడుదల అయిన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. యూట్యూబ్ లో 20 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. అలాగే 'నా మనసు నిన్ను చేర' పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విని పాటలు చాలా బాగున్నాయి అని కామెంట్ చేశారు. 

ఏప్రియల్ నెలలో విడుదలయిన "ఎదపొంగెనా ఏమో " పాట టాప్  ఇండియన్ సాంగ్ ఆఫ్ ది వీక్ గా ఎంపిక అయ్యింది. ఇప్పుడు సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'తోడై నువ్వుండక' అనే మెలోడీ పాటను శ్రీమతి అక్కినేని అమల గారు విడుదల చేశారు. ప్రముఖ గాయకురాలు సయొనోరా ఫిలిప్స్ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో మంగళవారం  విడుదలయింది.

శ్రీమతి అక్కినేని అమల గారు 'తోడై నువ్వుండక' పాటను వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. మంచి మెలోడీ పాటను అందించిన సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా మంచి విజయం సాధించాలి అని తమ అభినందనలు తెలియజేశారు.

Also Read: Oppo A58 Price: Oppo A58 స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 549లకే..ఎలా కొనాలో ఇలా తెలుసుకోండి!

దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ "శ్రీమతి అక్కినేని అమల గారికి ధన్యవాదాలు. మా నచ్చినవాడు చిత్రం లో అందమైన మెలోడీ పాట 'తోడై నువ్వుండక', ఇలాంటి మంచి పాటను అమల గారు విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, హాస్యానికి పెద్దపీట వేస్తూ, నేటి యూత్ కి కావాల్సిన ప్రతి అంశం ఇందులో పొందుపరిచారు. ఆగస్టు 24న విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.

చిత్రం: నచ్చినవాడు
నటీ నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు
ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్
DOP : అనిరుద్
కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్
సంగీతం - మిజో జోసెఫ్
కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా
నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకట రత్నం

Also Read: Upcoming Best Mobile: త్వరలోనే Xiaomi Redmi నుంచి మరో 3 మోడల్స్‌..స్పెసిఫికేషన్స్‌, ధర వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More