Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’

ఓ విలువైన వజ్రాన్ని కోల్పోయామంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్కూల్ ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫినిష్‌ను సుశాంత్ నుంచి ఊహించలేదని పాట్నా స్కూల్ యాజమాన్యం నటుడి ఆత్మహత్యపై స్పందించింది.

‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అవుతోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు సుశాంత్(Sushant Singh Rajput Suicide) మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే సుశాంత్ చదువుకున్న పాఠశాల మాత్రం నటుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇలాంటి ఫినిష్‌ను (జీవితాన్ని ఇలా ముగిస్తావని) ఊహించలేదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సెయింట్ కరెన్ సెకండరీ స్కూలు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. సుశాంత్‌‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్

బిహార్‌కు చెందిన సుశాంత్ కుటుంబం అనంతరం ఢిల్లీకి వచ్చేసింది. సుశాంత్ చదివిన స్కూల్ మేనేజ్‌మెంట్ అతడి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘సుశాంత్ ఇలా బలవన్మరణం చెందుతాడని అనుకోలేదు. ఇలాంటి ఫినిష్‌ను అతడి నుంచి ఊహించలేదు. అతడి ఆత్మకు శాంతి చేకూరాంటూ’ స్కూలు ఫేస్‌బుక్ పేజీలో సుశాంత్ సినిమాలకు సంబంధించిన కొన్ని స్టిల్స్ పోస్ట్ చేశారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవ్ స్టోరీ, బ్రేకప్

సుశాంత్ (Sushant Singh Rajput) ఇక లేడన్న వార్తను స్నేహితులు, స్కూలు పాత విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మేం ఇది నమ్మలేకపోతున్నాం. మనం మరో విలులైన వజ్రాన్ని కోల్పోయామంటూ’ సుశాంత్ మరణంపై స్కూలు చేసిన పోస్టుపై ఓ విద్యార్థి ఇలా స్పందించాడు. ‘మా స్కూలు ఫంక్షన్ అంటే చాలు సుశాంత్ ఫొటో ఫ్లెక్సీలో ఉండేది’, ‘ఓడిపోయినవారు ఆత్మహత్య చేసుకోరని చిచోరే సినిమాలే చెప్పారు. మరి నువ్వే ఎందుకిలా చేశావు’ అంటూ మరో స్కూల్ ఫ్రెండ్ కామెంట్ చేశాడు.  నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

తన కెరీర్‌ కోసం సుశాంత్ ముంబైకి వచ్చాడు. టీవీ సీరియల్లో (పవిత్ర రిస్తా) నటించి మెప్పించిన సుశాంత్ సహనటి అంకిత లోఖాండేతో ప్రేమాయణం ఈ క్రమంలో 2013లో కై పో చె అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. పీకే, ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ, కేదార్‌నాథ్, చిచోరే లాంటి సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలో జూన్ 14న ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Read More