Home> వినోదం
Advertisement

YS Jagan Biopic: వైఎస్ జగన్ పాదయాత్ర నేపధ్యంగా యాత్ర 2, జగన్ పాత్రలో ఎవరో తెలుసా

YS Jagan Biopic: ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ సిద్ధమౌతోంది. గత ఎన్నికలకు విడుదలైన యాత్రకు సీక్వెన్స్ ఈ ఎన్నికలకు విడుదల కానుంది.

YS Jagan Biopic: వైఎస్ జగన్ పాదయాత్ర నేపధ్యంగా యాత్ర 2, జగన్ పాత్రలో ఎవరో తెలుసా

YS Jagan Biopic: 2019 ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా ఓ సంచలనం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా జీవించడం..నేను ఉన్నాను..నేను విన్నాననే డైలాగ్ సైతం ప్రాచుర్యం పొందింది. ఆ యాత్రకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్రతో ప్రాచుర్యం పొందిన దర్శకుడు మహి వి రాఘవన్ మరో బయోపిక్2కు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి నాటి యాత్రకు సీక్వెల్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని తెరకెక్కించనున్నారు. యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి ప్రాణం పోశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఊహాగానాలకు తెరపడిందని తెలుస్తోంది. యాత్ర 2లో తమిళ నటుడు జీవా నటించనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ సైతం సిద్ధమైందట. మరి కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

యాత్ర 2 ఎలా ఉండబోతోంది

యాత్ర 2లో కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, ఓదార్పు యాత్ర, 2019లో ముఖ్యమంత్రి అవడం వంటి కీలక ఘట్టాలుంటాయి.  2024 ఎన్నికల నాటికి సినిమా విడుదల కావచ్చని అంచనా. పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎదురైన అడ్డంకులు, సీబీఐ, ఈడీ కేసులతో ఇబ్బందులు పెట్టడం, జైలు జీవితం అన్నీ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పాదయాత్రను ఎక్కువగా హైలైట్ చేయవచ్చు. వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న పరిస్థితులపై సినిమాలో ఎక్కవగా ఫోకస్ ఉంటుంది.

మరోవైపు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం 2024 ఎన్నికల నాటికి వైఎస్ జగన్ రాజకీయ నేపధ్యంలో వ్యూహం సినిమా సిద్ధం చేస్తున్నారు. అటు యాత్ర 2, ఇటు వ్యూహం రెండూ 2024 ఎన్నికల నాటికి ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

Also read: Sreeleela Tension: కోట్లు పెట్టి తెచ్చుకుంటే నిర్మాతలకు తలనొప్పిగా మారిన శ్రీలీల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More