Home> వినోదం
Advertisement

KGF 2 Collections: అన్‌స్టాపబుల్.. హిందీ బాక్సాఫీస్‌పై కేజీఎఫ్ 2 దండయాత్ర... ఇప్పటివరకూ ఎంత వసూలు చేసిందంటే..

KGF 2 Collections in Hindi: విడుదలై నెల రోజులు గడుస్తున్నా... వార వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా కేజీఎఫ్ 2కి ఎదురే లేకుండా పోయింది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. 

KGF 2 Collections: అన్‌స్టాపబుల్.. హిందీ బాక్సాఫీస్‌పై కేజీఎఫ్ 2 దండయాత్ర... ఇప్పటివరకూ ఎంత వసూలు చేసిందంటే..

KGF 2 Collections in Hindi: యశ్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'కేజీఎఫ్ 2' హిందీలో రికార్డుల మోత మోగిస్తోంది. సినిమా రిలీజై నెల రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఐదో వారంలోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ లాంగ్ రన్‌లో కొన్ని పెద్ద సినిమాలు తేలిపోతుంటాయి. కానీ కేజీఎఫ్ 2 మాత్రం అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. 

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేజీఎఫ్ 2 ఒక్క హిందీలోనే ఇప్పటివరకూ రూ.427 కోట్లు కొల్లగొట్టింది. గత శుక్రవారం (మే 13) రూ1.23 కోట్లు, శనివారం రూ.2.14 కోట్లు, ఆదివారం రూ2.98 కోట్ల వసూళ్ల రాబట్టింది. మొత్తంగా ఐదో వారంలో ఈ సినిమా రూ6.35 కోట్లు వసూలు చేసింది. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అవేవీ కేజీఎఫ్ 2 కలెక్షన్లపై ప్రభావం చూపించలేదని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. చాలా సినిమాలు మొదటి వారంలోనే తేలిపోతుంటే కేజీఎఫ్ 2 మాత్రం ఎదురే లేకుండా దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. 

ఇటీవల హిందీలో విడుదలైన 'రన్‌వే 34', 'హీరోపంతి 2', 'జయేష్ భాయ్ జోర్దార్', చిత్రాలు కేజీఎఫ్ 2 చిత్రానికి ఏమాత్రం పోటీనివ్వలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ ఈ సినిమాల ఓపెనింగ్స్ కూడా దారుణంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

యశ్-శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అన్నిచోట్లా బ్లాక్ బ్లస్టర్‌ టాక్ తెచ్చుకుంది. యశ్ నటన, డైలాగ్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్, రవి బసూర్ బీజీఎం ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 సైలెంట్‌గా వచ్చి బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా.. కేజీఎఫ్ 2 భారీ హైప్‌తో విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. 
 

Also Read: Ambati Retirement: రాయుడు వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది.. అంతా బానే ఉంది: చెన్నై కోచ్‌

Also Read: North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More