Home> వినోదం
Advertisement

Salaar: సలార్ ట్రైలర్ లో కనిపించిన యాష్ ‌‌...నిజమెంత

Yash: పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి విడుదలైన రెండో ట్రైలర్ ప్రేక్షకుల్లో కొత్త ఆశలను తీసుకొచ్చింది…

Salaar: సలార్ ట్రైలర్ లో కనిపించిన యాష్ ‌‌...నిజమెంత

 Yash in Salaar: కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్స్ లో అత్యున్నత స్థానం సంపాదించుకున్నారు ప్రశాంత్ నీల్. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మరోపక్క బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. కాగా ప్రశాంత్ నీ ప్రభాస్ కలిసి సినిమా చేస్తున్నారు అని తెలియగానే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక వీరిద్దరూ కలిసి చేసిన సలార్ సినిమా మొదటి భాగం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సలార్ సినిమా ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ సినిమాకు కేజీఎఫ్ కి లింక్ ఉంది అని వార్తలు వచ్చాయి. లోకేష్ కనకరాజు యూనివర్స్ లాగా ప్రశాంత్ నీల్ యూనివర్స్ కూడా రాబోతోంది అని పుకార్లు కూడా ఉన్నాయి.

కాగా ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఈరోజు తాజాగా పూర్తి యాక్షన్ కట్ తో మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ ట్రైలర్ లో యాష్ కనిపించారు అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తున్నాయిView this post on Instagram

ట్రైలర్ లోని ఓ సీన్ లో గన్స్ పేరుతున్నప్పుడు పక్కన ఒక వ్యక్తి నిలబడుకొని ఉంటాడు. ఆ వ్యక్తి వైట్ కోర్టు వేసుకొని ఉంటారు. కాగా అది కే జి ఎఫ్ లో యాష్ వేసుకునే లాంటి డ్రస్ అని.. అది యాష్ అని కొంతమంది పోస్టులు. 

ఇక వేరొక షాట్లు ఒక వ్యక్తిని బ్యాక్ నుంచి చూపించారు. ఆ కటౌట్ చూస్తుంటే అది తప్పకుండా యశ్ లాగా కనిపిస్తున్నారు. ఈ బ్యాక్ షాట్‌ని, కేజీఎఫ్ లోని యశ్ బ్యాక్ షాట్‌ని కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ అక్కడ కనిపిస్తుంది కచ్చితంగా  యాష్ అని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన మూవీ లవర్స్.. యశ్ ఈ సినిమాలో నిజంగా కనిపించబోతున్నారా..? అనే ఆసక్తి నెలకుంది. 

కాగా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదని ఇటీవల కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రేక్షకులు మాత్రం తప్పకుండా ఈ సినిమాకి కేజిఎఫ్ కి ఏదో లింక్ ఉంది అని ప్రచారం సాగిస్తున్నారు. ఇక దీంట్లో నిజానిజాలు తెలియాలి అంతే సలార్ విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFace

  

Read More