Home> వినోదం
Advertisement

మరో అర్జున్ రెడ్డిలా "వరల్డ్ ఫేమస్ లవర్" టీజర్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. విజయ్ దేవరకొండ మరోసారి లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని తలపిస్తున్న టీజర్ కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు. ఇప్పటికే ఈ టీజర్ భారీ హైప్ సంపాదించుకుంది.

 మరో అర్జున్ రెడ్డిలా

హైదరాబాద్ : విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. విజయ్ దేవరకొండ మరోసారి లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని తలపిస్తున్న టీజర్ కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు. ఇప్పటికే ఈ టీజర్ భారీ హైప్ సంపాదించుకుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ప్రేమంటే త్యాగం కాదు, ప్రేమలో ఓ దైవత్వం ఉంటుందంటూ హీరోయిన్ చెప్పే డైలాగుతో మొదలైన టీజర్, చివర్లో ఐ లవ్యూ యామిని అంటూ విజయ్ దేవరకొండ తీవ్ర భావోద్వేగాలతో చెప్పడంతో ముగుస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూస్తే అర్జున్ రెడ్డి పోకడలు కనిపించకమానవని తెలుస్తుంది. 

Read More