Home> వినోదం
Advertisement

Venkatesh Maha Apologizes: క్షమించమని కోరిన వెంకటేష్ మహా.. కానీ ఆ మాట వెనక్కు తీసుకోడట!

Venkatesh Maha Apologies: కేజిఎఫ్ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు వెంకటేష్ మహా ఆ విషయంలో క్షమాపణలు చెబుతూ ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.
 

Venkatesh Maha Apologizes: క్షమించమని కోరిన వెంకటేష్ మహా.. కానీ ఆ మాట వెనక్కు తీసుకోడట!

Venkatesh Maha Apologizes: తాజాగా కేజిఎఫ్ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు వెంకటేష్ మహా ఆ విషయంలో క్షమాపణలు చెబుతూ ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేశారు. తాను తన ఒపీనియన్ మీద నిలబడుతున్నానని చెబుతూనే తాను మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని తనకే అనిపించిందని ఇదే విషయాన్ని చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలి అంటూ ఆయన పేర్కొన్నారు.

తాను పేర్కొన్నది ఒక సినిమాలో ఒక కల్పిత పాత్రను మాత్రమే అని ఆ పాత్రనే దూషించానని దాన్ని అడ్డం పెట్టుకుని తనను దారుణంగా అసభ్యంగా దూషిస్తున్నారని తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఏ సినిమా మీదైనా నాకు నచ్చకపోతే దాన్ని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం తనకు ఉంటుందని అలా వ్యక్తం చేస్తున్నప్పుడు కాస్త నోరు జారిన మాట వాస్తవమే, ఆ విషయంలో క్షమించాలి అంటూ ఆయన పేర్కొన్నారు.

ఆయన మాత్రమే కాదు ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉండి నవ్విన వారు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా క్షమాపణ చెబుతున్నారు. అందరికంటే ముందుగా నందిని రెడ్డి క్షమాపణ చెప్పగా ఇప్పుడు వివేక్ ఆత్రేయ, మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా క్షమాపణలు చెప్పారు. వివేకాత్రేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మీరు చాలా సేపు ఒక సంభాషణలో భాగమైనప్పుడు అది ఎలా వెళుతుందో అలాగే రియాక్ట్ అవుతారు, నిన్న మీరు చూసిన ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పిన దానికి నేను రియాక్ట్ అయ్యాను అంతేగాని ఎవరి వర్క్ ని ఎవరి కష్టాన్ని ఎద్దేవా చేయడం నా ఉద్దేశం కాదు.

అది కమర్షియల్ సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా ఒకరి పనిని కించపరచడం అనేది ఎతిక్స్ అనిపించుకోదు ఆ విషయంలో నేను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన పేర్కొన్నారు. మరోపక్క మోహన్ కృష్ణ ఇంద్రగంటి సైతం తన సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూలో తన ఉద్దేశం కానీ లేకపోతే అక్కడ ఉన్న మిగతా దర్శకుల ఉద్దేశం కానీ కేజీఎఫ్ 2 సినిమాని లేదా కేజిఎఫ్ సినిమా అభిమానులను కించపరచడం తక్కువ చేసి మాట్లాడటం కాదని అన్నారు, ఆ సినిమాలో నటుడిని కానీ దర్శకుడుని కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని అన్నారు.

అలాగే ప్రతి సినిమా మీద ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని తాను నమ్ముతున్నానని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సినిమా మీద వారి వారి అభిప్రాయాలు ఉంటాయి. మేము వెంకటేష్ మహా చెబుతున్న విధానానికి నవ్యాము తప్ప అతను మాట్లాడుతున్న భాషకు నవ్వొచ్చింది అంతేగాని వారు ఎవరినో కించపరుచుతున్నందుకు కాదని పేర్కొన్నారు. ఇక కేజిఎఫ్ 2 అభిమానులు మా రియాక్షన్ చూసి బాధపడినట్లయితే క్షమించమని అడుగుతున్నాను మా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు ఇది తప్పుగా ప్రజలు అర్థం చేసుకున్నారు అంటూ ఆయన రాసుకొచ్చారు.

Also Read: Manchu Manoj on Son: కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..మౌనిక కుమారుడిపై మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Also Read: Malaika Arora Photos: ముదురు వయసులోనూ తగ్గేదేలే అంటూ హాట్ ట్రీట్స్ ఇస్తున్న మలైకా.. క్లీవేజ్ షో మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
Read More