Home> వినోదం
Advertisement

OTT vs Bollywood: ఓటీటీ అంటే ఏంటి, ఓటీటీ.. బాలీవుడ్‌కు ప్రధాన ఆటంకంగా ఎందుకు మారింది

OTT vs Bollywood: ఓటీటీ..ఓవర్ ది టాప్. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇదొక విప్లవం. ఓటీటీ కారణంగా చలన చిత్ర పరిశ్రమకు నష్టమే కలుగుతుందన్పిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు సమస్య ఎదురౌతోంది. 
 

OTT vs Bollywood: ఓటీటీ అంటే ఏంటి, ఓటీటీ.. బాలీవుడ్‌కు ప్రధాన ఆటంకంగా ఎందుకు మారింది

OTT vs Bollywood: ఓటీటీ..ఓవర్ ది టాప్. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇదొక విప్లవం. ఓటీటీ కారణంగా చలన చిత్ర పరిశ్రమకు నష్టమే కలుగుతుందన్పిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు సమస్య ఎదురౌతోంది. 

హిందీ చలన చిత్ర పరిశ్రమ లేదా బాలీవుడ్ ఎప్పుడూ లేనంతగా ఎగుడు దిగుడు ఎదుర్కొంటోంది. 2021 జనవరి నుంచి 43 హిందీ సినిమాల సగటు రేటింగ్ 5.9 గా ఉంది. 18 హిందీ డబ్ సినిమాల సగటు రేటింగ్ 7.3 కంటే చాలా తక్కువగా ఉండటం గమనించాలి. ఎస్బీఐ ఆర్ధిక విభాగం అందించిన నివేదిక ప్రకారం..ఐఎండీబీ రేటింగ్‌కు సంబంధించిన ఒక పాయింట్‌తో 17 కోట్ల రూపాయలు ఆర్జిస్తాయి. సింగిల్ స్క్రీన్ ధియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కువ సినిమాలు మల్టీప్లెక్స్‌లలో విడుదలవుతున్నాయి. మల్టీప్లెక్స్‌లో సింగిల్ స్క్రీన్ ధియేటర్‌తో పోలిస్తే టికెట్ ధర 3-4 రెట్లు ఎక్కువ. హిందీ సినిమాలపై ఉన్న అధిక ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ ఒక కారణంగా ఉంది. 

దక్షిణాదిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య అధికం

ఈ రిపోర్ట్ ప్రకారం 62 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు దక్షిణాదిలో ఉండటం ఆసక్తి కల్గించే అంశం. ఉత్తర భారతదేశంలో కేవలం 16 శాతం మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమాన సింగిల్ స్క్రీన్ ధియేటర్లు 10 శాతం ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే దక్షిణాది సినిమాలు ఎక్కువ కలెక్షన్లు సాధించడం వెనుక ఇది కూడా ఓ కారణం కావచ్చని తెలుస్తోంది. 

ఆన్‌లైన్ వేదికల్లో అన్ని రకాల కంటెంట్

ఆన్‌లైన్ వేదికలు యాక్షన్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్, కామెడీ వంటి అన్ని రకాల కంటెంట్ అందిస్తున్నాయి. ఆ కంటెంట్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉత్తరాదితో పోలిస్తే వృద్ధుల సంఖ్య ఎక్కువ. ఇప్పటికే దక్షిణాదిలో ఓటిటీలతో పోలిస్తే సినిమా ధియేటర్లలోనే ఎక్కువగా సినిమాలు చూడటం ఇష్టపడుతుంటారు. 

ఓటీటీలలో ఎక్కువ సమయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ధిక విభాగం నివేదిక ప్రకారం ఓటీటీలో వృద్ధి వల్ల సినిమా ధియేటర్ల ప్రేక్షకులపై ప్రభావం పడుతోంది. ఎందుకంటే 50 శాతం కంటే ఎక్కువమంది నెలలో 5 గంటలకంటే ఎక్కువ ఓటీటీ ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు స్మార్ట్‌టీవీ, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లతో ఎంటర్‌టైన్‌మెంట్ సరికొత్తగా పొందుతున్నారు. ఇంట్లోనే థియేటర్ ఎఫెక్ట్ పొందుతున్నారు. 

ఇండియాలో 45 కోట్ల ఓటీటీ కస్టమర్లు

భారత చలనచిత్ర పరిశ్రమకు అతిపెద్ద ఆటంకం ఓటీటీల ఆవిర్భావం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దాదాపుగా 7-9 సాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది క్రమంగా పెరుగుతోంది. అన్ని భాషల్లో ఇది కన్పిస్తోంది. ఓ నివేదిక ప్రకారం దేశంలో 45 కోట్ల మంది ఓటీటీ కస్టమర్లున్నారు. 2023 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకోవచ్చు.

Also read: Raviteja Movie with Karthik Ghattamaneni: దర్శకుడిగా ఫ్లాప్.. సినిమాతోగ్రాఫర్ గా హిట్టు.. అనూహ్యంగా అవకాశం ఇచ్చిన రవితేజ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More