Home> వినోదం
Advertisement

We Love Bad Boys: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'.. ఆసక్తి రేకిస్తోన్న ఫస్ట్ లుక్ పోస్టర్..

we Love Bad Boys: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ ఇండస్ట్రీస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రూట్‌లోనే వచ్చిన మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

We Love Bad Boys: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'.. ఆసక్తి రేకిస్తోన్న ఫస్ట్ లుక్ పోస్టర్..

we Love Bad Boys First Look Poster : తెలుగు సహా ప్రతి ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మాస్ అండ్ ప్రేమ కథా చిత్రాలే. ఈ మధ్యకాలంలో రొటిన్ ప్రేమ కథా చిత్రాలు కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండే ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదిరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో వెరైటీ ప్రేమ కథా చిత్రమే 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'.  కొత్త నిర్మాణ సంస్థ బి.ఎమ్. క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పల వరలక్ష్మీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కనక దుర్గారావు నిర్మాత.
ఈ సినిమాతో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా ఉండబోతుందని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుగుస్తోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స వచ్చింది.

ఈ సినిమాలో అజయ్, వంశీ ఏకశిరి, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్ వంటి నటీనటులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇప్పటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందన్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్‌కు మంచి శుభారంభం ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. నిర్మాత పప్పుల కనక దుర్గారావు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాకు రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ హిల్లేరియస్ ఎంటర్టైనర్‌కు భాస్కరభట్ల పాటలు అందించారు. రఘు కుంచె - గీతా మాధురి - లిప్సిక - అరుణ్ కౌండిన్య, మనోజ్ శర్మ కుచి ఈ సినిమాలో పాటలు పాడారు.

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More