Home> వినోదం
Advertisement

Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

Watch Glimpse of Ghani first punch video: గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తుండగా ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

Watch Glimpse of Ghani first punch video: వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమా గని నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. గ్లింప్స్ ఆఫ్ గని ఫస్ట్ పంచ్ పేరిట గని మేకర్స్ ఓ ప్రోమో వీడియోను విడుదల చేశారు. కిరణ్ కొర్రపాటి రచించి డైరెక్ట్ చేస్తోన్న గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో 'గని ఫస్ట్ పంచ్' పేరిట మేకర్స్ ఈ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా గని సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు యూనిట్ సభ్యులు ఈ ప్రోమో వీడియో ద్వారా వెల్లడించారు.

గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తుండగా ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ గని సినిమాను రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబి కంపెనీ బ్యానర్స్‌పై సిద్దు ముద్ద, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. వరుస హిట్స్‌తో జోష్ మీదున్న థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా జార్జ్ సి విలియమ్స్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. 

Also read : MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లో మరో మైలురాయిగా గని చిత్రం నిలిచిపోతుందని గని మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ చెబుతున్నట్టుగా గని చిత్రం ఉంటుందా లేదా తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. వరుణ్ తేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుణ్ F3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. F2 సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 చిత్రం హైదరాబాద్‌లోనే షూటింగ్ (Allu Arjun at F3 movie shooting sets) జరుపుకుంటోంది. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాద, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also read : Kondapolam making video: అంచనాలు పెంచిన కొండపొలం మేకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More