Home> వినోదం
Advertisement

Bigg Boss Telugu 4 Voting Numbers: నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

Bigg Boss 4 Telugu Voting for 8th week Elimination | 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) లో నామినేషన్ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. ఇంటి నుంచి బయటకు పంపేందుకు 6 మంది సభ్యులను నామినేట్ చేశారు. 

Bigg Boss Telugu 4 Voting Numbers: నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా 8వ వారానికిగానూ బిగ్‌బాస్ 4 (Bigg Boss Telugu 4) హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. బిగ్‌బాస్ 4లో 51వ ఎపిసోడ్‌లో జరిగిన 8వ వారం నామినేషన్ ప్రక్రియలో ఇంటి నుంచి బయటకు పంపేందుకు 6 మంది సభ్యులను నామినేట్ చేశారు. 

 

8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. బిగ్‌బాస్‌కు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జోడీ అఖిల్, మొనాల్‌లను మాత్రం ఎలిమినేట్ చేయరని వీక్షకులు భావిస్తున్నారు. అందరికన్నా వీక్ కంటెస్టెంట్ అని, తక్కువ ఓట్లు సైతం ఆమెకే అని బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు భావిస్తున్నా.. ప్రతివారం మొనాల్ గజ్జర్ సేవ్ కావడాన్ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

8వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే..
అరియానా - 8886658210
లాస్య - 8886658203
అఖిల్ - 8886658215
అమ్మ రాజశేఖర్ - 8886658211
మొనాల్ - 8886658201
మెహబూబ్ - 8886658206

 

లాస్య.. అమ్మ రాజశేఖర్, మొనాల్ గజ్జర్‌ను చేశారు. ఆ తర్వాత వరుసగా అఖిల్.. అరియానా, అమ్మ రాజశేఖర్‌లను, మెహబూబ్.. అరియానా, మొనాల్ గజ్జర్‌లను, అవినాష్.. లాస్య, హారికను నామినేట్ చేశారు. అమ్మ రాజశేఖర్.. అఖిల్, లాస్యను, అరియానా.. మెహబూబ్, అఖిల్‌లను, ఇస్మార్ట్ సొహైల్.. అరియానా, అమ్మ రాజశేఖర్‌ను, నోయల్.. మెహబూబ్, అఖిల్, అభిజిత్.. మొనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్‌లను, దేత్తడి హారిక.. అరియానా, మెహబూబ్‌లను, చివరగా మొనాల్ గజ్జర్.. మెహబూబ్, లాస్యలను నామినేట్ చేసిందని తెలిసిందే.

 

రెండు రకాలుగా (మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్) ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ సేవ్ చేయవచ్చు.. 

మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్... (Bigg Boss 4 Telugu Voting Missed Call Numbers)
మీ ఫెవరెట్ కంటెస్టెంట్ లాస్య అయితే 8886658203కు మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు నమోదు అవుతుంది. ఇలా పది సార్లు మిస్డ్ కాల్ ఇస్తే 10 ఓట్లు లాస్యకి వస్తాయి. ఒకరికి 3, ఒకరికి 4, మరొకరికి 3 మిస్డ్ కాల్స్ ఇచ్చి  ఓట్లను షేర్ కూడా చేయవచ్చు. కింద ఉన్న నెంబర్లలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజులో డయల్ చేసే తొలి 10 నెంబర్లకు ఓట్లు పడతాయి.

 

హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్..
డిస్నీ హాట్‌స్టార్ యాప్ వాడుతున్న వారు సోవారం నుంచి శుక్రవారం వరకు ఎపిసోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే ఓటింగ్ అని కనిపిస్తుంది. ఒక్క కంటెస్టెంట్ ఫొటో క్లిక్‌కు ఒక్క ఓటు. రోజుకు 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే వ్యక్తికి అయినా వేయవచ్చు. లేక ఒకరికి 4, మరొకరికి 4, మిగిలిన రెండు ఓట్లను ఇంకో సభ్యుడికి ఓట్లు షేర్ చేయవచ్చు. యాప్ లేని వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్‌స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Read More