Home> వినోదం
Advertisement

Vishwak Sen: విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..!

Vishwak Sen Remuneration: యంగ్ హీరో విశ్వక్ సేన్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక్కో సినిమాకి.. విశ్వక్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ బాగానే పెంచినట్లు తెలుస్తోంది. అనుదీప్ దర్శకత్వంలో.. చేస్తున్న సినిమా కోసం విశ్వక్ సేన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. 

Vishwak Sen: విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంతో  తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..!

Vishwak Sen VS14 Update: ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి..యంగ్ హీరో విశ్వక్ సేన్.. ఎక్కువ సినిమాలు చేసేయాలి అని కాకుండా.. కెరియర్ పరంగా ఆలోచిస్తూ.. మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకటి రెండు సినిమాలు తప్ప.. లైనప్ లో ఎక్కువ సినిమాలు కూడా ఉంచలేదు. కానీ తాజాగా ఇప్పుడు విశ్వక్ సేన్.. తన సినిమాలో జోరు అమాంతంగా పెంచేసినట్లు తెలుస్తోంది. 

ఈమధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు.. మెకానిక్ రాకీ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా మరొక మూడు సినిమాలు.. లైన్ లో పెట్టేసారు. అందులో ఒకటి లైలా అనే సినిమా. దీనికి సంబంధించిన పోస్టర్ కి.. ఈ మధ్యనే మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఆ తరువాత జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ.. దర్శకత్వంలో కూడా విశ్వక్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ సినిమాగా.. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కూడా విశ్వక్ సేన్.. ఒక సినిమా చేస్తున్నారు. పవర్ పేట అనే టైటిల్ తో.. తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందు నితిన్ నటించాల్సి ఉంది.. కానీ ఈ సినిమా ఇప్పుడు.. విశ్వక్ చేతుల్లోకి వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం..విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక్కో సినిమాకి..తను తీసుకుపోయే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. అనుదీప్ తో.. చేస్తున్న సినిమా నుండి విశ్వక్ సేన్ ఒక్కో సినిమాకి 7 కోట్ల.. చప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఆ సినిమాని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా.. విశ్వక్ సేన్ డిమాండ్ కి ఓకే చెప్పేసారట. ఇలా సినిమాలో స్పీడ్ తో.. పాటే ఈ యంగ్ హీరో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేశారు. మరి ఈ సినిమాలతో..విశ్వక్ సేన్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More