Home> వినోదం
Advertisement

Vishwak sen : పదమూడేళ్లకే ఆ పని మొదలెట్టేశాడట!.. విశ్వక్ సేన్ మామూలోడు కాదు

Vishwak sen Controversies విశ్వక్ సేన్ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. చివరగా అర్జున్‌తో జరిగిన కాంట్రవర్సీ మాత్రం విశ్వక్ సేన్‌కు కాస్త బ్యాడ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టేసింది.

Vishwak sen : పదమూడేళ్లకే ఆ పని మొదలెట్టేశాడట!.. విశ్వక్ సేన్ మామూలోడు కాదు

Vishwak sen Das Ka Dhamki విశ్వక్ సేన్ ప్రస్తుతం తన దాస్ కా ధమ్కీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో పడ్డాడు. విశ్వక్ సేన్ చివరగా ఓరి దేవుడా అనే రీమేక్‌తో వచ్చాడు. ఓ మై కడవలై అనే సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఓరి దేవుడా సినిమా పర్వాలేదనిపించింది. విశ్వక్ సేన్ నటన అందరినీ మెప్పించింది. అంతకు ముందు అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమా సైతం విశ్వక్ సేన్‌కు మంచి నటుడిగా పేరు తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ కూడా వచ్చింది.

విశ్వక్ సేన్ యాటిట్యూడ్, బిహేవియర్ మీద మాత్రం ఎప్పుడూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అర్జున్ సర్జా తన కూతురిని తెలుగులో పరిచయం చేయాలని అనుకున్నాడు. విశ్వక్ సేన్‌తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. కానీ సినిమా షూటింగ్ ప్రారంభం నాడు హ్యాండ్ ఇచ్చాడు. ఈ సినిమా లాంచింగ్‌కు పవన్ కళ్యాణ్‌ చీఫ్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ బజ్ ఏర్పడింది.

కానీ విశ్వక్ సేన్, అర్జున్ మధ్య గ్యాప్ ఏర్పడింది. సినిమా ఆగిపోయింది. హీరోగా విశ్వక్ సేన్‌ను అర్జున్ తీసేశాడు. విశ్వక్ సేన్ సైతం సినిమా నుంచి మర్యాద పూర్వకంగా తప్పుకున్నాడు. విశ్వక్ సేన్‌లోనూ ఓ డైరెక్టర్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అలా అర్జున్ విశ్వక్ సేన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టుగా ఉన్నాయి.

fallbacks

మొత్తానికి అర్జున్ ఇంకో హీరోను వెతుక్కునే పనిలో ఉన్నాడు. విశ్వక్ సేన్ తన సినిమాలను పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాతో రెడీగా ఉన్నాడు. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ఫోటోను షేర్ చేశాడు. పదమూడేళ్ల వయసులోనే తాను యానిమేషన్ కోర్సును నేర్చుకున్నాను అంటూ నాటి ఐడీని చూపించాడు. అందులో విశ్వక్ సేన్ తన పేరు కనిపించుకుండా జాగ్రత్త పడ్డాడు. విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు అన్న విషయం తెలిసిందే. ఆ పేరు కలిసి రావడం లేదని, విశ్వక్ సేన్ అని మళ్లీ మార్చుకున్న విషయం తెలిసిందే.

Also Read:  Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్

Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More