Home> వినోదం
Advertisement

Kajal Aggarwal Dance at Haldi Ceremony: హల్ది వేడుకలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Dance at Her Haldi Ceremony | నటి కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. నిన్న కాజల్ హల్ది వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక ఫొటోలు, ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kajal Aggarwal Dance at Haldi Ceremony: హల్ది వేడుకలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన కాజల్ అగర్వాల్

ఇన్ని రోజులు నీ పెళ్లెప్పుడు.. అని ప్రశ్న విని విసిగిపోయిన నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal Wedding) ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. నిన్న కాజల్ హల్ది వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక ఫొటోలు, ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి  (Kajal Aggarwal Marriage) వేడుకలు గత మూడు రోజుల కిందట మొదలయ్యాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ వివాహ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందట నటి కాజల్ అగర్వాల్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో హల్ది వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పసుపు రంగు దుస్తులు ధరించిన కాజల్ అగర్వాల్ కాలు కదిపింది. డ్యాన్స్‌ చేస్తూ హల్ది వేడుకకు హాజరైన వారిలోనూ జోష్ నింపింది.  Photos: Jabardasth యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్

 

  
సినిమా షూటింగ్‌లో పాల్గొని యాక్టివ్‌గా ప్రదర్శన చేసిన మాదిరిగానే చందమామ కాజల్ డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియోలు నేడు ఆమె వివాహం సందర్బంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నిన్న జరిగిన కాజల్ అగర్వాల్ హల్ది వేడుక ఫొటోలు (Kajal Aggarwal Haldi Ceremony Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More