Home> వినోదం
Advertisement

Pawan kalyan Fans: పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. 2023లో డబుల్ బొనాంజా!

Vinodhaya Sitham Telugu Remake Shoot : అవును మీరు వింటున్నది నిజమే, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు ఒక గుడ్ న్యూస్, అదేమంటే వచ్చే ఏడాది ఆయన రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆ వివరాలు 

 Pawan kalyan Fans: పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. 2023లో డబుల్ బొనాంజా!

Vinodhaya Sitham Telugu Remake Shoot to Start in January: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గత ఎన్నికల ముందు ఆయన సినిమాలు పూర్తిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో తన జీవితం ఇక రాజకీయాలకు అంకితమని సినిమాలు చేసే ఉద్దేశం లేదని ఆయన ప్రకటించారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోవడం, ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన వారు ఒకే ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఆయన మళ్ళీ సినిమాల వైపు చూడటం మొదలుపెట్టారు.

ఎన్నికలు జరిగి జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్ కనుక మంచి పాలనందిస్తే తాను మళ్ళీ సినిమాలు చేసుకుంటానని పవన్ పేర్కొన్నారు. కానీ జగన్ పాలన ప్రారంభం కాకముందే పవన్ కూడా సినిమాలు మొదలుపెట్టేశారు. అలా పవన్ చేసిన సినిమాలలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఆయన మరిన్ని సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టారు. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా కొన్నిసార్లు షూటింగ్స్ బంద్ కారణంగా మరికొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతోంది.

ఇక ఎలా అయినా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఆ సంగతి అలా ఉంచితే పవన్ కళ్యాణ్ ఇటీవల మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఇక అనౌన్స్ మెంట్ కూడా లేని మరో సినిమాకి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అప్డేట్ తెరమీదకు వచ్చింది. తమిళంలో నటుడు దర్శకుడు సముద్రఖని వినోదయసిత్తం అనే సినిమా చేశారు. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. జనవరిలో సంక్రాంతి పండుగ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాక వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ డెడ్ లైన్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక రకంగా 2023లో రెండు సినిమాలతో పవన్ కళ్యాణ్ తన అభిమానులు అలరించబోతూ ఉండడంతో ఆయన అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా ఇది ఆయన అభిమానులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Also Read: Disha Patani Pics: దిశా పటాని బికినీ ట్రీట్.. హాట్ స్టిల్స్ చూస్తే అంతేసంగతులు!

Also Read: Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. కొత్త జీవితం అంటూ కడపలో ఆసక్తికర కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
Read More