Home> వినోదం
Advertisement

Family Star Update: కాలేజ్‌లో హల్‌చల్‌ చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్‌' విజయ్‌-మృణాల్‌ ఠాకూర్

Family Star Shoot: దీపావళికి పోస్టర్‌తో సందడి చేసిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సీతారామం భామ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పాట పాడేసుకుంటున్నారని సమాచారం. 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రీకరణలో వీరు చేస్తున్న సందడి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

Family Star Update: కాలేజ్‌లో హల్‌చల్‌ చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్‌' విజయ్‌-మృణాల్‌ ఠాకూర్

Vijay Deverakonda-Mrunal Thakur: 'ఖుషీ'తో పర్వాలేదనిపించిన విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఈ క్రమంలోనే మంచి కుటుంబ నేపథ్యమున్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా పేరేంటో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ స్టార్‌. తనకు భారీ హిట్‌ ఇచ్చిన దర్శకుడు పరశురాంతో కలిసి కుటుంబాన్ని అంతా అలరించేందుకు రౌడీ హీరో 'ఫ్యామిలీ స్టార్‌' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

 ఇటీవల ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రౌడీ అభిమానులకైతే క్రేజీ అనిపించాయి. ఈ సినిమా అప్డేట్‌ కోసం ఎదురుచూస్తుండగా.. సోషల్‌ మీడియాలో ఒక అప్‌డేట్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోందని తెలిసింది. ఈ విషయాన్ని ఆ చిత్ర బృందమే తెలిపింది. హైదరాబాద్‌ శివారులోని వాక్సెన్‌ యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు షూటింగ్‌ జరుగుతుందని ప్రకటించింది.

కాలేజ్‌లో జరుగుతున్న షూటింగ్‌ ఫొటోలు, వీడియోలను 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రబృందం సోషల్‌ మీడియాలో పంచుకుంది. కొత్త షెడ్యూల్‌ గురువారం నుంచి ప్రారంభమైందని ప్రకటించింది. మరో ఐదు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందని తెలిపింది. చిత్రంలోని కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మాత్రం సినిమా యూనిట్‌ వెల్లడించింది. సినిమాలో కీలకమైన పాటను ఇక్కడ షూట్‌ చేస్తున్నారని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌.

ఈ సినిమాలో 'సీతారామం' 'హాయ్‌ నాన్న' వంటి హిట్లు అందుకున్న మృణాల్‌ ఠాకూర్‌ విజయ్‌ సరసన నటిస్తోంది. విజయ్‌-మృణాల్‌ మధ్య అందమైన సన్నివేశాలు చిత్రీస్తున్నారని సమాచారం. వీరి మధ్య కెమెస్ట్రీ ప్రేక్షకులకు వినోదం అందిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఆసక్తిగా ఉంది. 'ఐరనే వంచాలా ఏంటి?' అనే డైలాగ్‌ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కేయూ మోహనన్‌, గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కాలంలో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Also Read: Harish Rao Letter: మా బంగారు పిల్లలు.. 'పది' విద్యార్థులకు హరీశ్‌ రావు ఆత్మీయ లేఖలు

Also Read: AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More