Home> వినోదం
Advertisement

Vijay Deverakonda Fans: అభిమానులకు గుడ్ న్యూస్.. కాదు కాదు బంపరాఫర్

Vijay Deverakonda Fans : విజయ్ దేవరకొండ ఫాన్స్‌కి గుడ్ న్యూస్. ఐదేళ్ల క్రితం తాను స్టార్ట్ చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ట్రెడిషన్‌ని ఈ సంవత్సరం ఇంకొంత కొత్త స్టైల్‌ని అవలంభిస్తూ నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడట. ఈ ఏడాది ఒక మంది అభిమానులను హాలీడే ట్రిప్ కి పంపించనున్నట్టు స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.  

Vijay Deverakonda Fans: అభిమానులకు గుడ్ న్యూస్.. కాదు కాదు బంపరాఫర్

Vijay Deverakonda Fans: అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెపరేట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులతో నడుచుకునే తీరులోనూ తన రూటే సెపరేటని నిరూపించుకున్నాడు. తన అభిమానుల్లో జోష్ నింపడం కోసం ఎప్పటికప్పుడు కొంగొత్త పద్ధతులను అవలంభించే విజయ్ దేవరకొండ ఐదేళ్ల క్రితమే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. దేవర సంత క్యాంపెయిన్ పేరుతో ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగకు, కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ 100 మంది అభిమానులను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ వస్తున్నాడు.

ఐదేళ్ల క్రితం తాను స్టార్ట్ చేసిన ఈ ట్రెడిషన్‌ని ఈ సంవత్సరం ఇంకొంత కొత్త స్టైల్‌ని అవలంభిస్తూ నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడట. ఈ ఏడాది ఒక మంది అభిమానులను హాలీడే ట్రిప్ కి పంపించనున్నట్టు స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మీలో ఒక 100 మంది అభిమానులకు ఆ అవకాశం దక్కుతుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఆ హాలీడే ట్రిప్పులో అభిమానులకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. అంటే.. వెళ్లి, రావడానికి టికెట్స్ తో పాటు హోటల్ స్టేయింగ్, సైట్ సీయింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్, పార్టీలు, షికార్లు.. ఇలా అభిమానులు ఎంజాయ్ చేసే ప్రతీ ఖర్చు తనదేననేది విజయ్ దేవరకొండ ఉద్దేశం.

100 మంది అభిమానులను హాలిడే ట్రిప్ కి పంపిస్తానని చెప్పిన విజయ్ దేవరకొండ.. డెస్టినేషన్ విషయంలో మాత్రం ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. అందుకే ఎక్కడికి వెళ్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటూ అభిమానులకే ఆ ఛాన్స్ వదిలేశాడు. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీరు కూడా విజయ్ దేవరకొండ డై హార్డ్ ఫ్యాన్ అయితే.. ఆ ఛాన్స్ మీకు కూడా రావొచ్చునేమో చూడండి మరి. 

 

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుత ప్రాజెక్ట్ విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషీ సినిమా షూటింగ్‌తో విజయ్ బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23నే విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్యం కారణంగా మధ్యలో షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. డిసెంబర్‌లోనే తిరిగి షూటింగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది సమ్మర్ వెకేషన్‌ని టార్గెట్ చేస్తూ ఖుషీ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి : Mega Fans Fire on Mythri Movie : బాలయ్య అంటే భయమా?.. చిరుపై అలసత్వమా?.. మైత్రీపై మెగా ఫ్యాన్స్ ఫైర్

ఇది కూడా చదవండి : Singer Chinmayi Video : న్యూడ్ ఫోటో లీక్ చేస్తానంటూ బెదిరింపులు.. చిన్మయి వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Nikhil 18 Pages : ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా.. కథ కూడా నాకు తెలీదు.. నిఖిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More